ఊహా లోకం;- ఏ బి ఆనంద్, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం,
 ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి వ్యక్తి తన మనసు చెప్పినట్లు చేయడానికి  అది ఆడించినట్లు ఆడడానికి సిద్ధపడి ఉంటాడు  ఇది సహజమైన ప్రక్రియ  శరీరం మొత్తాన్ని ఆటలాడించేది ఈ మనసే  ఆ మనసును స్వాధీనం చేసుకోవడం అనేది  ఎవరో మునులకు ఋషులకు తప్ప  మామూలు సాధారణ వ్యక్తికి అసాధ్యమైన విషయం  జీవితంలో అలాంటి ఆలోచనలు కూడా ఇలాంటి వారికి రావేమో  ఆ మనసు చెబుతున్నది కనుక మనం ఆలోచనలో పడి దానినే చేస్తూ ఉంటాం తప్ప  మన ప్రయత్నం లేదు అనేది చాలామందికి అర్థం కాదు  తానే కావాలని ఆ పని చేస్తున్నట్లుగా  భ్రమలకు లోనవుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు  అలాంటి జీవితాలు ఎలా ఉంటాయో వేమన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు.
సామాన్యంగా యవ్వనంలో ఉన్న కుర్రవాడు జీవితాన్ని ఎంతో అందంగా చిత్రించుకొని  ఆ పద్ధతిలో జీవించడానికి  ప్రణాళికలనుసిద్ధం చేసుకుని ఉంటాడు  ఎలా ఉంటాయి ఆ వయసులో ఆ ఆలోచనలు  ఒక అందమైన  తనకు నచ్చిన వయసులో ఉన్న ఆడపిల్ల తన ప్రక్కన ఉండాలి  హాయిగా  విశాలమైన ప్రదేశంలో ఒక తోట లాంటిది నిర్మించుకొని  మధ్యలో ఒక బావి తీసి  దాని ప్రక్కన మల్లి పందిరి వేసి  ఆ పందిరిలో సరదాగా  ఆటపాటలతో గడపాలన్న అభిప్రాయం మనసుకు వస్తుంది  అతనికి ఆ తోటకు సరిపడిన స్థలం ఉన్నదా  అతనిని చూసి మోహించి తన వెంటపడే ఆడపిల్లలు ఎవరైనా ఉన్నారా  అన్న విషయాలను గురించి ఆలోచించవలసిన అవసరం తనకు లేదని అనుకుంటాడు  అలా ఊహా ప్రపంచంలో  తన సుఖాలను తీర్చుకుంటూ ఉంటాడు.
ఇలా ఊహా లోకంలో విహరించే  పక్షుల్లా జీవితాన్ని గడపడానికి బదులు  జీవితంలో తాను సాధించదలిచిన విషయం ఏదైనా ఉన్నదా అంటే అది ముక్తి అన్న విషయం తెలుసుకొని  ఆ ముక్తి కోసం ప్రయత్నం చేస్తే అతని జీవితం సఫలం అవుతుంది అన్న  సూచన చేస్తున్నాడు వేమన  వేమన చెప్పిన పద్ధతిలో అతని జీవితాన్ని కొనసాగించినట్లయితే  గురుముఖతః మోక్షాన్ని పొందడానికి చేయవలసిన  పద్ధతులను  పూర్తిగా తెలుసుకొని దానిని ఆచరించడం కోసం స్థలాన్ని ఎన్నుకొని  అక్కడ ఏకాంతంగా మనసును నిర్మలంగా ఉంచుకొని  ఏ స్వరూపాన్ని మనసులో నిలుపుకొని ధ్యానం చేయాలనుకుంటున్నాడో దానిపైనే మనసును లగ్నం చేస్తే  జీవితంలో ముక్తి లభిస్తుంది తప్ప  ఊహలతో కాదు అంటున్నాడు వేమన ఆ పద్యాన్ని చదవండి.

"మానసంబు మంచి మల్లె సాల చవికె  భావి తోట జేసి బారుగూడి  భోగినయ్యేదనన  బోయె  బోకాలంబు..."


కామెంట్‌లు