ఇక్ష్వాకుని కుమారుడు నిమి ఇతను సుదీర్ఘమైన యాగంతలపెట్టి దాన్ని నిర్వహించవలసిందిగా వసిష్టుని కోరాడు.అంతకు ముందే ఇంద్రుడు తనయాగం నిర్వహించవలసినదిగా కోరడంతో,తను ఇప్పుడు రాలేనని వచ్చెవరకు వేచిఉండమన్నడు వసిష్టుడు.నిమి మౌనంగా వచ్చేసాడు. తనకోసం నిమి వేచిఉంటాడనుకొని ఇంద్రలోకం వెళ్లాడు వసిష్టుడు.
కాని వసిష్టుడు వచ్పేవరకు నిమి ఆగకుండా గౌతమమహర్షి,మరియు ఇతర మునులతో కలసి యాగం ప్రారంభించాడు. ఇంద్రలోకంలోయాగం ముగించుకుని నిమిని చూడటానికి వసిష్టుడు వచ్చాడు.అప్పటికే నిమి చేస్తున్నయాగం సగంపూర్తి అయింది.అదిచూసి తననునిమి అవమానపరచాడని భావించిన వసిష్టుడు నిమిని శరీరంలేకుండా జీవించమని శపించాడు.కోపగించిన నిమికూడా వసిష్టుని దేహంలేని వాడవై పొమ్మని శపించాడు.తనమిత్రుడైన వరుణుని సహాయంతో వసిష్టుడు వేరే దేహాన్ని పొందాడు.
నిమిశరీరాన్ని మునులు భద్రపరిచారు.యాగానంతరం నిమికి దేహాన్ని దేవతలు ఇస్తాముఅన్న నిమి తిరస్కరించాడు.తను మానవజాతి కంటి రెప్పలపై జీవించేలావరంపొందాడు.దేవతలు అలానేవరం ఇచ్చారు.అప్పటినుండి నిమి మనుష్యుల కంటిరెప్పలపై జీవించసాగాడు.అందుకే రెప్పపాటు కాలానికి నిమేషం అన్నపేరు వచ్చింది.నిమికి సంతానం లేనందున అతనిశరీరంనుండి ఓబాలుని సుృష్టించిన మునులు అబాలునికి 'జనకుడు'అనేపేరు పెట్టారు.అతని తండ్రికి శరీరంలేనందున'విదేహుడు'అనికూడాపిలవసాగారు.ఈజనకుడు లక్ష్శిదేవిని ప్రార్ధించి జానకిదేవి గా యాగభూమి దున్నుతుండగా , మందసంలో లభించింది.
నిమి.(పురాణకథ).; - డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి