ఆయన వయస్సు ఎనబై అయిదేళ్ళు.
ఎక్కడికి వెళ్ళినా భార్య చేయి పట్టుకుని నడిచేవారు.
ఒకరోజు ఒక మిత్రుడడిగాడు....
"చాలా కాలంగా చూస్తున్నా నిన్ను. ఆమెనెందుకలా పట్టుకోవడం? ఆమె బాగానే చూడగలుగుతోందిగా?" అని.
వెంటనే ఆయనిలా స్పందించారు...
"తను అల్జీమర్స్ తో బాధపడుతోంది" అని.
"ఆమెను విడిచిపెట్టి నువ్వెళ్తే బాధపడుతుందా" అని మిత్రుడి ప్రశ్న.
అప్పుడాయన "ఆమెకు ఏదీ గుర్తుండదు. ఆమెకు నేనెవరో తెలీదు. నన్ను గుర్తించి చాలా కాలమైంది" అన్నారు.
మిత్రుడు ఆ మాటకు విస్తుపోయాడు.
"అంటే ఆమె నిన్ను గుర్తించడం మానేసి చాలా ఏళ్ళయినప్పటికీ నువ్వు ప్రతి అడుగుకీ చేయందిస్తున్నావా...విడ్డూరంగా ఉంది" అన్నాడు మిత్రుడు.
అంతట ఆ పెద్దాయన చిన్న నవ్వు నవ్వి "ఆమెకు నేనెవరో తెలియకపోవచ్చు. కానీ ఆమె నాకేమవుతోందో ఏమిటో నాకు తెలుసుగా. ఆమె నా జీవిత ప్రేమ" అని నెమ్మదిగా చెప్పారు.
నిజమైన ప్రేమ ఎన్నటికీ మరణించదు.
అందుకే అంటుంటారు
నిజమైన ప్రేమను చూపించు. దేవుడు నీకు తప్పకుండా మంచి ఫలితాన్నిస్తాడు అని!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి