వేడంతాంగల్ పేరెలా వచ్చింది?- - యామిజాల జగదీశ్
 తమిళనాడులోని ఓ ప్రాంతం పేరు వేడంతాంగల్. ఇంతకూ ఆ పేరెలా వచ్చిందో చూద్దాం...
ఆంగ్లేయుల కాలంలో అక్కడ వేటగాళ్ళు ఉండిపక్షులను వేటాడేవారు. వేటగాళ్ళు అనే మాటను తమిళంలో వేడర్గళ్ అని అంటారు. తమిళంలో "ట" అనే అక్షరాన్నే "డ"గా కూడా పలుకుతారు. ఈ కారణంగా వేటగాళ్ళు అక్కడ ఉండి పక్షులను వేటాడటం వల్ల వేడంతాంగళ్ అనే పేరు వచ్చింది.
అయితే తర్వాతి కాలంలో పక్షులను వేటాడటాన్ని అక్కడ నిషేధించారు. ఇప్పటికీ వేడంతాంగళ్, దాని పరిసర గ్రామ ప్రాంతాల ప్రజలు పక్షులను వేటాడరు. వాటికి ఎటువంటి ఇబ్బందీ కలిగించరు.
పక్షులు భయపడతాయనే ఉద్దేశంతో వేడంతాంగళ్ ప్రజలు దీపావళి రోజున టపాకాయలు కూడా కాల్చరు. 
పక్షులు ఎంగిలి చేసి మిగిల్చిన నీటిని అక్కడి రైతులు పంటపొలాలకు పారించే నీటిలో కలుపుతారు. ఇలా చేయడంవల్ల పంటలు బాగా పండుతాయని అక్కడి రైతుల నమ్మకం. 

కామెంట్‌లు