తొలకరి చినుకుల లీల
పచ్చని పైరుల హేల
రంగుల మబ్బుల డోల
మురిసే అందాల ఇల
కురిసిన మబ్బుల అలసట
తడిసిన తరువుల ముచ్చట
విసిరే గాలి వివరాలు
మురిసే నేల సంబరాలు
ఆకాశవీధిలో అపురూపం
తూరుపు దిక్కున వెలిగే దీపం
కొండల మధ్యన సాక్షాత్కరించే
లోకాన్ని కాపాడే దైవస్వరూపం
నిన్నటి గతాలకు జ్ఞాపకంగా
రేపటి స్వప్నాలకు ఆధారంగా
ఈనాటి క్షణాలు వాస్తవంగా
సమయరథాన్ని నడిపే సారథిని
మండే ఎండలతో తపింపచేసినా
వరుస వానలతో తడిపించేసినా
కష్ట నష్టాలకు కారణం మనమేనని
తనకు ఎటువంటి సంబంధం లేదనీ
అమృతమయమైన ధరిత్రిని
ప్రతిఫలాపేక్ష రహితంగా
అవసరాలు గమనించుకునే
పర్యావరణాన్నీ ప్రకృతినీ
పదిలంగా చూసుకోకపోతే
ప్రతిస్పందన ఇదేననీ
ప్రస్తుత పరిస్థితులకు
ప్రజలంతా బాధ్యలేననీ
ప్రతీసారీ పాఠం చెబుతున్నా
అర్ధం చేసుకోని విద్యార్థిలా
పరాజయం పాలైతే ప్రాప్తించే
పరిణామం తాను ఆపలేననీ
అందరికీ అవగతం అయేలా..
అనుగ్రహించమని
అర్థిస్తూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి