బాలలు-భవిష్యత్తులో
మీరు ఒక అమ్మ ఒక నాన్న కాగలరు
కానీ
ఒక టీచరు కాగలరా కాగలరు
కానీ చాలా కష్టం!!
ఒక టీచరు మీరు కాగలిగితే
మీరు ఒక డాక్టర్ కాగలరు
ఒక యాక్టర్ కాగలరు
ఒక ఇంజనీర్ కాగలరు
ఒక లాయర్ కాగలరు
ఒక శాస్త్రవేత్త కాగలరు
ఒక లీడర్ కాగలరు-.!!
అంటే
మీరు ఒక టీచర్ అయితే
ఇంక మీరు ఏమైనా కాగలరు.!!
ముందు మీరు
మీకు మీరు ఒక టీచర్ అవ్వాలి
మరొకరికి మీరు ఒక టీచర్ అవ్వాలి.
కనుక ఇక మీరు
తప్పకుండా రేపు
ఒక డాక్టరు ఒక యాక్టర్
ఒక లాయరు ఒక లీడర్
ఒక శాస్త్రవేత్త ఒక ఇంజనీరు కాగలరు
ఇది నిజం అందుకే
మీరు బాగా నేర్చుకోవాలి
మరొకరికి నేర్పాలి.........!!
అంటే ముందు మీరు ఒక టీచర్ అవ్వాలి!!
పుస్తక పఠనం వల్లనే ఇది సాధ్యం!!!........!!
పాఠశాల విద్యాశాఖ పఠనోత్సవాల ముగింపు సందర్భంగా రాసిన కవిత.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి