నా నేస్తం ! మనసెరిగిన నేస్తం !
స్నేహితులదినోత్సవం రోజునే
తెలిసిన తర్వాత- ఆమె ఇక లేరని
ఎంత ఆప్యాయత
మరెంత ఆదరణ
ఇంకెంత చిరునవ్వుల పలకరింపో
ఇప్పుడామె ఒక జ్ఞ్యాపకంగా
ఏమిటో?
మంచివాళ్ళనే దేవుడు ఇష్టపడతాడేమో!?
కాసిని కబుర్లు చెబితే చాలు
మాగాయి పచ్చడి నా స్వంతం
ఒకటా.. రెండేళ్లా.... ఏడేండ్లు
మాటలా! కానే కాదుగా!
సొంత ఆడ పడుచులనే పట్టించుకోని కాలం
నా కోసం-- నన్ను సుఖపెట్టటం కోసం
ఎవరూ చెబితే నమ్మనే నమ్మరు.
నువ్వడిగావా?
ఆవిడ కెలా తెలిసిందని కొందరి ప్రశ్నలు
కారణాలు నాకు తెలియదు
కబుర్ల స్నేహమే నాకు తెలుసు
నాకేం కావాలో అది చేసిపెట్టటమే వారెరిగినది
ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనేదే నా ఆకాంక్ష!
స్నేహితులదినోత్సవం రోజునే
తెలిసిన తర్వాత- ఆమె ఇక లేరని
ఎంత ఆప్యాయత
మరెంత ఆదరణ
ఇంకెంత చిరునవ్వుల పలకరింపో
ఇప్పుడామె ఒక జ్ఞ్యాపకంగా
ఏమిటో?
మంచివాళ్ళనే దేవుడు ఇష్టపడతాడేమో!?
కాసిని కబుర్లు చెబితే చాలు
మాగాయి పచ్చడి నా స్వంతం
ఒకటా.. రెండేళ్లా.... ఏడేండ్లు
మాటలా! కానే కాదుగా!
సొంత ఆడ పడుచులనే పట్టించుకోని కాలం
నా కోసం-- నన్ను సుఖపెట్టటం కోసం
ఎవరూ చెబితే నమ్మనే నమ్మరు.
నువ్వడిగావా?
ఆవిడ కెలా తెలిసిందని కొందరి ప్రశ్నలు
కారణాలు నాకు తెలియదు
కబుర్ల స్నేహమే నాకు తెలుసు
నాకేం కావాలో అది చేసిపెట్టటమే వారెరిగినది
ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనేదే నా ఆకాంక్ష!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి