గజేంద్ర మోక్షం (57 నుండి 63 )
-----------------------------------------
యెంత గొప్ప నామంబది
శరణాగతెంత గొప్పది
ఇంకెంతటి గొప్పదో
పూర్వ జన్మ పుణ్యంబది
నామంబు శరణాగతి
గత జన్మలపుణ్య స్థితి
మూడు కలిపి తెలుపునదే
అష్టమ స్కంధపు సుదతి
అన్నీ అనుకూలమైన
అవరోధము లేకుండిన
మనుజుల లోపంబేమొ
కానడు శరణం వేడిన
వెంటాడగ మృచ్ఛువు
అడవిలోని జంతువు
స్తుతించగనె ఏకంగా
వచ్చెన నడచి ప్రభువు
మానవులే తలువరయ్య
ఏనుగెట్లు తలచెనయ్య
తలువగనే ఇదిగోమని
దేవుడెట్లు వచ్చెనయ్య
పరీక్షిత్తుదుత్సాహము
నిరీక్షించి వినె మధురము
తెలియగోరి ప్రశ్నించగ
శుకబ్రహ్మ జెప్పె మూలము
మూలమూలాగ్రమంత
వర్ణించగ మనసంత
చిత్తము నిల్పుచు వినగ
పులకించెను తనువంత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి