గజేంద్ర మోక్షం (69నుండి 73)
----------------------------------------
నెమలి పక్షి జాతులు
రెపరెపమనిరెక్కలు
రివ్వుమనుచు ఎగిరేవట
నింగి లోకి గువ్వలు
అడవి వరాహంబులు మరి
గొయ్యి తీసి లోన దూరి
ఉండేవట వాటిలోనె
ఏనుగులకు భయపడి మరి
పెద్ద పెద్ద నాగులు
గబగబమని పరుగులు
పెట్టి పెట్టి దూరేనట
వాటి నివాసంబులు
చామర మృగజాతికిమరి
వాటితోక బరువట మరి
పారిపోను వీలుగాక
తోకతొ విసిరేవట మరి
భక్తీ భయము గౌరత
కలగలిపినట్లు నడత
వింజామర విసురుచు
గజముల కిచ్చెను ఘనత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి