ఆధ్యాత్మిక మణిపూసలు;- మమత ఐల-కరీంనగర్-9247593432
గజేంద్ర మోక్షం (74.నుండి 80)
=======================
మహిషంబులు అడవిలో
పారిపోయి మడుగులో
కనిపించ కుండ దాగుచు
నుండేవట నీటిలో

పెద్ద పెద్ద కోతులు
గంతులేసి గుట్టలు
ఉరికి ఉరికి ఎక్కేవట 
ఎంతటి చిత్రంబులు

అడవిలోని కొస దాక
రంకె బెట్టుచునాగక
జింకలు కుందేళ్ల వంటి
ఇతరత్రములురుకు నిక 

సద్దుమణిగి పోవుదాక
ఎక్కడి వక్కడనే ఇక
ఏనుగు సమూహాల
ఆటల దర్జాల గనుక

ఆనందం గజములదే 
గాంభీర్యం గజములదే
లేనిదంటు లేదు గాన
ఉత్సాహం గజములదే

అంత గొప్ప సమూహము
ఎంతటి గొప్ప బలగము
వారందరికధిపతిగా
ఈ చక్కని గజేంద్రము

మలుపు తిరుగి ఒక్క క్షణం
తగిలెను తిమిరపు బాణం
మకరంబుతొ జేసెను
వెయ్యి వత్సరముల రణం
 


కామెంట్‌లు