హరివిల్లు 141
🦚🦚🦚🦚
రామ రామ రామ రామ
నామమున్న చాలు మనకు..!
ధర్మ దారి పట్టు కున్న
భక్తి ముక్తి కలుగు తుదకు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 142
🦚🦚🦚🦚
కొమ కోమ కోమలి
కోమలాంగి విశాలాక్షి...!
చెలి చెలియ చెలువ
చంద్రముఖి చంచలాక్షి....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 143
🦚🦚🦚🦚
నెల నెలా వేలకు వేల
ఉచితాలు ఆపెయ్యాలి...!
అందరికీ మేలు చేయు
ఉచిత చదువులు నేర్పాలి...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 144
🦚🦚🦚🦚
భువిలో బ్రహ్మ కమలం
అద్భుత పుష్ప సౌరభం...!
వెన్నెల్లో కాంతి మయం
సువాసనల సంరంభం.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 145
🦚🦚🦚🦚
డబ్బును విచ్చలవిడిగా
వెచ్చించడం మానుకో.....!
అదుపు పొదుపు చేసి
హెచ్చించడం నేర్చుకో......!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి