హరివిల్లు రచనలు,;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
హరివిల్లు 156
🦚🦚🦚🦚
నిదుర పోయానని
లక్ష్యం మరువ వలదు..!
మేల్కొలుపు కాలేదని
నిర్లక్ష్యం చేయవలదు....!!

🦚🦚🦚🦚
హరివిల్లు 157
🦚🦚🦚🦚 
తొలకరి వాన చినుకులకు
వెల్లువలా చిరు ఆకులు.....!
వేసవి ఉష్ణ తాపమున
మల్లె మొగ్గల గుత్తులు.......!!

🦚🦚🦚🦚
హరివిల్లు 158
🦚🦚🦚🦚
సెలయేటి నదీ జలాల
పరవళ్ళకు సాటి లేదు...!
దీపకాంతి ప్రమిదల
వెలుగులకు పోటి లేదు....!!

🦚🦚🦚🦚
హరివిల్లు 159
🦚🦚🦚🦚 
ప్రకృతిలో కృతకృత్య
సత్య ఆకృతులు కనుము......!
తర్క శాస్త్రమునకందని
చక్రధారి లీల గనుము.......!!

🦚🦚🦚🦚
హరివిల్లు 160
🦚🦚🦚🦚 
పీడ నీడ పాలనైతె
జనులకు రణరంగమే.....!
చీమల జోలికి వస్తే
పాముకైనా మరణమే......!!

                      (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు