హరివిల్లు రచనలు,;-కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 171
🦚🦚🦚🦚
జనులందరికి ఉచితాలు
ప్రగతికి అవరోధాలు........!
సహేతు రహిత ఉచితాలు
సమ సమాజ నాశనాలు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 172
🦚🦚🦚🦚 
పొద్దు తిరుగుడు పూలు
రవి వైపే తన చూపులు.....!
హద్దు మీరిన చ్యేష్టలు
పైరవి వైపే తపనులు........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 173
🦚🦚🦚🦚
నెలరాజు‌ కిరణాలు
నేల రాలిన పాచికలు....!
పున్నమి వెన్నెల వేళలు
ఉప్పొంగు ప్రేమ వీచికలు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 174
🦚🦚🦚🦚 
చిరునవ్వు ముఖముతో
చెలిమికి శ్రీకారం.............!
మాటల శ్రీ ముఖముతో
చెలిమికి గుణకారం........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 175
🦚🦚🦚🦚 
దేశ కాల పాత్ర తెరిగి

దాన గుణమే సద్బుద్ధి....!
ముద్గలునికి ఫలించి 
వచ్చెగదా తపఃస్సిద్ధి......!!
                        (ఇంకా ఉన్నాయి)
కామెంట్‌లు