సామాన్య మానవులు ఎవరైనా సరే తన శారీరక సుఖాలకు ఇచ్చిన ప్రథమ స్థానం మరి దేనికి ఇవ్వరు. క్షణికమైన ఆనందానికి అలవాటు పడి ఇది తప్ప ఈ ప్రపంచంలో మనకు కావలసినది ఏమీ లేదు అన్న ఆలోచన చేసి దానిని పూర్తిగా అనుభవించడం కోసం తపన పడతాడు సాధించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు అయితే అసలు తత్వం ఏమిటి అని తెలుసుకోవడానికి ఎవరినైనా వివరాలు అడిగి తెలుసుకోవడానికి మనసు అంగీకరించదు తత్వము అంటే అతనికి తెలిసింది వేదాంతం అదంతా మాయ శంకరాచార్యుల వారు చెప్పింది కూడా నీ కంటికి కనిపించే దేనిని నమ్మకు ప్రతిదీ కూడా నిజమైనది కాదు మిథ్య అన్న విషయం తెలుసు కానీ దాని అసలు అర్థం తెలుసుకోవడానికి మనస్సంగీకరించదు కనుక ఆ ప్రయత్నం చేయడు.
మిథ్య కానిది ఏది అని ఆలోచించే తీరిక ఓపిక ఆ వ్యక్తికి ఉండదు మనసు చెడు వైపుకు ఆకర్షించినంత తేలికగా మంచి వైపుకు మళ్లదు అని మన పెద్దలు చెప్పే సూక్తి ప్రతి ఒక్కరికి తెలిసినదే కానీ దానిని అర్థం చేసుకొని ఆచరించే వారే చాలా తక్కువ మంది నిజానికి ఎవరూ లేరు అని చెప్పవచ్చు ఈ భౌతికమైన శారీరక సుఖాలకు అలవాటు పడి మరింత సుఖాలను పొందాలన్న ఆరాటంతో చేసే పనులను ఎంతవరకు కొనసాగిస్తే వారికి తృప్తి ఉంటుంది అన్నది ఆలోచించవలసిన విషయం ఆర్ధిక శాస్త్రంలో మన వాళ్ళు చెప్పేది నీకు బాగా ఇష్టమైన పండు దొరికితే దానిని ఆబగా తిని వేస్తావు రెండవది మూడవది కూడా తిన్న తర్వాత నీ మానసిక స్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి.
మరొక పండు మీదకు మనసు మళ్లుతుంది అలా ఎన్ని అనుభవించగలడు చివరకు పండు అంటేనే విరక్తి కలిగి దాని జోలికి వెళ్ళడు శారీరక సుఖాలు కూడా అంతే అంటాడు వేమన ఆయన నిజ జీవితంలో జరిగిన అనేక సంఘటనలను ఆధారం చేసుకుని వేశ్యలపై ఉన్న మమకారాన్ని చంపుకొని జీవిత పరమార్ధం ఇది కాదు అని తెలుసుకొని మరి ఏమిటి దాని కోసం ఎలా ప్రయత్నం చేయాలి అని ఎంతో తపన పడి ఏకాంత ప్రదేశానికి వెళ్లి కొండ గుహలో కూర్చుని తపో నిష్ఠతో ఆలోచించి దానికి సరైన మార్గాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన సాధకుడు కనుక జీవిత సత్యాలు ఎంతో అందంగా మన ముందు మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేసి సఫలీకృతుడయ్యాడు
ఆ అనుభవంతో రాసిన పద్యాన్ని ఒకసారి చదవండి.
"తానె తత్వమనుచు దన్నెరుంగగలేక
మాయ మనుచు మరుగుచుండు ధర్మ కర్మములను తగరోయ తత్వమౌ..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి