మానవుని జన్మ ప్రత్యేకమైనది బ్రహ్మ సృష్టించిన జీవరాసులన్నిటిలో పెరుగుదల కదలికలతో పాటు వాక్కును కూడా ప్రసాదించారు ఈ మాటల వల్ల తాను చెప్పదలుచుకున్న విషయం ఎదుటివారికి స్పష్టంగా తెలియడం వారికి ఏవైనా అనుమానాలు వచ్చినప్పుడు వారు కూడా తన మాటల ద్వారా నివృత్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా మానవ జన్మ ఉత్కృష్టమైనది అని చెప్పవచ్చు ఒక చెట్టుకు ఒక భూమికి ఒక జంతువుకు ఒక క్రిమికి ఒక కీటకానికి లేని ప్రత్యేకత ఈ మానవ జన్మకు ప్రకృతి ప్రసాదించిన వరం దానిని నిలబెట్టుకోవలసిన బాధ్యత మానవుని పైనే ఉన్నది ఇదేదో హక్కు అని భిష్మించుకు కూర్చుంటే దానికి పరిష్కారం అంటూ ఏదీ లేదు.
మన పెద్దలు మనకు చెప్పిన దానిని బట్టి బ్రహ్మ ఈ సృష్టిని ఏర్పాటు చేస్తే దానిని పరిరక్షించి పెంచవలసిన బాధ్యతను విష్ణుమూర్తి తీసుకుంటే ప్రణాళికా బద్ధమైన జీవితాన్ని ఇచ్చే బాధ్యత అర్ధనారీశ్వరుడు తీసుకున్నాడు అని మనకు చెబుతారు ఇది వేద సమ్మతమైన విషయం ముందు జన్మనిచ్చిన బ్రహ్మను మనం జపిస్తూ ఈ జీవితాన్ని ఆనందించడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తన భార్య సరస్వతి దేవి కటాక్షం వల్ల ప్రతి అక్షరాన్ని వాడుకో గలిగిన స్థితికి వచ్చిన వ్యక్తిని నేను అంటూ వారిని వేడుకుంటూ వారి ఆశీస్సులు పొందిన తరువాత విష్ణుమూర్తి తన హృదయం పై లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచుకోవడం వల్ల మనసు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండడానికి కారణమైన ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఉండాలి. వారి ఆశీస్సులు పొందిన తరువాత కుటుంబము అనే అర్ధాన్ని ముందుకు నడిపించడానికి భార్యాభర్తలు ఇద్దరు బాధ్యత వహించి ఎక్కువ తక్కువ అనుకోకుండా సంసారం సుఖమయంగా సాగడానికి కారణమైన ఆ శంకరుని కరుణా కటాక్ష విక్షణాలు మన పైపడేట్టుగా చూసి ఆ దంపతుల ఆశీస్సులు పొందాలి ఈ స్థితి ఎప్పుడైతే పరాకాష్టకు వచ్చి ముగ్గురు దీవెనలతో ముందుకు వెళ్ళడం అంటే శివుని లో ఐక్యం కావడానికి మార్గం సులభం అయింది అన్నమాట ఆ తర్వాత నిర్మల హృదయంతో శివుని లో ఐక్యమై శివయోగిగా ప్రసిద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది అంటాడు వేమన ఆ విషయాన్ని వ్రాసిన పద్యాన్ని ఒక్కసారి చదవండి మనకు దాని లోతు ఏమిటో తెలుస్తుంది.
"బ్రహ్మ జంపి విష్ణు భాగంబులో గల్చి విష్ణు జంపి శివుని వెలయ గల్పి శివుని చంపి తాను శివయోగి గావలె..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి