మా గ్రామంలో ఉద్యోగరీత్యా మంచి పేరు సంపాదించుకున్న వాడు విట్టల్ రెడ్డి సబ్ రిజిస్టర్ గా ఉద్యోగం చేసి నిజాయితీపరుడు అన్న పేరుతో ఉద్యోగ విరమణ చేశారు విజయవాడలో కొండవీటి అకాడమీ అనే సంస్థని గ్రామ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసి 55 లక్షల మూల ధనాన్ని ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో శ్రీ యోగి వేమారెడ్డి నిత్య అన్నదాన సత్రం అన్న సంస్థ విజయవాడ శాఖ ప్రెసిడెంట్ గా ఉండి శ్రీశైల క్షేత్రంలో 39 గదులతో శ్రీ వేమారెడ్డి పీఠమును అన్నదాన సత్రమును వృద్ధుల ఆశ్రమమును ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ ని గోసాలను నిర్మించాలని ఏర్పాటు చేశారు అనేకమంది ఆ సత్రంలో వివాహాలు అనేక శుభ కార్యాలు చేసుకోవడానికి అనువుగా ఉన్నది ఆ సంస్థ.
తన జీవిత అనుభవంలో మా గ్రామ యువకులకు తాను చేసిన కొన్ని సూచనలు ఏ యువకునకైనా యువతికైనా మొదటినుంచి ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యసాధన కోసం ప్రయత్నం చేయండి దానికోసం ఎన్ని కష్టాలనైనా భరించాలి పెద్దల మనసు కష్టపెట్టకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లాలి చెడు నడతకు గానీ చెడు అలవాట్లకు కానీ దూరంగా ఉండి అతను ఫలానా మంచి వ్యక్తి తల్లిదండ్రులను గౌరవించేవాడు అన్న పేరు తెచ్చుకోవాలి ప్రత్యేకించి యువత పెద్దవారి ఆస్తిపై ఆధారపడకూడదు పెద్దలు సంపాదించిన ఆస్తి తనకు హక్కు కాకుండా దానికి ధర్మకర్తలుగా ఉండి వారిచ్చిన ఆస్తిని సద్వినియోగం చేసేయాలి అత్యవసరమైన వారికి సహకరించడం కోసం దానిని వాడాలి తప్ప దుర్వినియోగం చేయకూడదు.
మీ జీవితం మీరు హాయిగా ప్రశాంతంగా గడుపుతూ సాధ్యమైనంత వరకు మీ ఎదుటివారు పడుతున్న బాధలను కూడా గమనించి సహకరించడం సాయం చేయడం నేర్చుకోండి మంచి చేయడం తప్ప ఏ పరిస్థితుల్లోనూ అపకారం చేయకండి ఉపకారం చేస్తే మీ బిడ్డలు ఉపకారాన్ని పొందుతారు అపకారం చేస్తే మీ బిడ్డలు అపకారానికి గురవుతారు సమాజంలో ఆర్థికంగా గాని రాజకీయంగా గాని ధార్మికమైన పనుల్లో కానీ ఎదిగే వారిని ప్రోత్సహించాలి మీరు కూడా అలా ఎదగడానికి ప్రయత్నం చేయాలి గ్రామంలో కక్షలు కార్పణ్యాలకు తావు లేకుండా యువకులు ఐక్యత సాధించి గ్రామానికి కావలసిన సదుపాయాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి నలుగురుని కలుపుకొని ఒకే కుటుంబంగా జీవితం గడిపితే మంచి వ్యక్తులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు అని చెప్పేవాడు.
మన గన్నవరం; - ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి