ఆ రోజుల్లో పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది సుబ్బారెడ్డి అంటే ఎవరికి తెలియదు రంగమ్మ గారి సుబ్బారెడ్డి అంటే అందరికీ తెలుసు అలా పేర్లతో ప్రసిద్ధి చెందిన చెల్లమ్మ గారి సుబ్బారెడ్డి ఆదిమ్మ గారి రామిరెడ్డి నాగమ్మ గారి కోటిరెడ్డి అలివేలమ్మ గారి కోటిరెడ్డి అలా గృహిణి పేరు చెప్పితే తప్ప వీరి పేరు తెలియదు వీరందరిలోకి మా నాయనమ్మ పేరే పైన ఉండేది గ్రామంలో ఎవరైనా కలహాలతో విడిపోతే వారిద్దరినీ కూర్చోబెట్టి తప్పు ఎవరిదో నిర్ధారణ చేసి ఆ సమస్యను పరిష్కరించేది ఆ రోజుల్లో నాటువైద్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది కామెర్ల వ్యాధితో ఎవరైనా బాధపడుతూ నాయనమ్మ దగ్గరికి వస్తే వారిని పాత చింతపండు తెచ్చుకోమని చెప్పేది. వారు చింతపండు తెచ్చిన తరువాత నాయనమ్మ తన గదిలోకి వెళ్లి కోరుకున్న సున్నం కొంచెం తీసి ఈ చింతపండులో కలిపి దానిని మూడు భాగాలు చేసి ఉండలు చేసి వారికి ఇచ్చేది మూడు రోజులు రోజుకి ఒక వంట చొప్పున తినమనేది నాలుగో రోజున వారు వచ్చి తగ్గిపోయిందని చెప్పి వెళ్ళేవారు మా నాయనమ్మకు అన్ని మాటలు సరిగ్గా రావు మా ఊర్లో కాంపౌండర్ చాలా బారుగా ఉండేవాడు ఎవరైనా తన మాట వినకపోతే ఏరా కంపోల్ లాగా పెరిగావు ఆ మాత్రం చేయలేవట్రా అని కేకలు వేసేది అతని పేరు కంపోలు కాదమ్మా కాంపౌండర్ అని అంటే అదే లేరా నాకు పడుకుతుందా పాడా అనేది ప్రయాణాలంటే ఆవిడకి చాలా ఇష్టం తనతో పాటు దాదాపు ఒక పది మందిని తీసుకొని పరిసర ప్రాంతాలలో ఉన్న దేవాలయాలన్నీ చూసి వచ్చేది.
ఈమె బృందం కాశీ రామేశ్వరం మొదలైన పుణ్యక్షేత్రాలు సందర్శించి వచ్చిన తర్వాత గ్రామస్తులు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసేది అందరిని ఆహ్వానించింది పూర్వం ఎప్పుడో వెలివేయబడ్డ కుటుంబాన్ని కూడా పిలవడం జరిగింది వాడు కూడా వచ్చి భోజనానికి కూర్చున్నారు మా నాయనమ్మ అల్లుడు ఆ కుటుంబ సభ్యులను వెంటనే బయటకు పంపించమన్నాడు అప్పుడు నాయనమ్మ చెప్పిన సమాధానం ఏమయ్యా వారి పూర్వీకులు చేసిన తప్పులకు వీరు బాధ్యులు కారు కదా వీరిని ఎందుకు బయటకు పంపించాలి నేను పంపను కావాలంటే మీరు లేచి వెళ్ళండి అని నిర్మొహమాటంగా చెప్పింది ఆ రోజు నుంచి వెలివేయబడ్డ కుటుంబాన్ని గ్రామస్తులు అందరూ తమ శుభకార్యాలకు పిలుస్తూ ఉంటారు. ఏది చేసినా అంత ధైర్యంగా చేసేది మా నాయనమ్మ.
మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి