నేటి మహిళలు.;-... కోరాడ నరసింహా రావు !
వంటింటి కుందేళ్ళను మాటనే రుజువుచేస్తూ... 
  బాల్యంనుండే ఈ ఆడపిల్ల తీరు... మనకు కనపరిచే !!

నోరూరే రుచులతో... వంటలెన్నో చేయుచు... 
  ఇంటిల్లి పాది, కడుపులను నింపుతూ... 
   ఆనందము పంచే ఆడవారు అమ్మ లేకదా.... !

వంటా వార్పులలో... పని, పాటు లలో నే కాదు 
  చదువు, సంధ్యలలో... వివేక బుద్ధిలో సైతం.... 
   నేటి ఆడపిల్ల లదే కదా అగ్రస్థానం... !!
    వీరు ఆబల లైన ఆనాటి మహిళలు కారు..., 
  అన్నింటా మేటియైన నేటి మహిళలు... !
       ********


కామెంట్‌లు