బాలమేధావి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆ15 ఏళ్ల కుర్రాడు రాజదర్బారులో ఓపండితుడితో
విద్య అనే అంశంపై చర్చ కి సిద్ధమైనాడు.ఆచిన్నవాడి భాష గంగాప్రవాహంలా
అలా సాగిపోతూనే ఉంది.అందరూ చెవులప్పగించితలాడిస్తూ శభాష్ అన్నారు.చప్పట్లమోతతో అభినందనలతో అంతా ఆపుంభావసరస్వతిని కొనియాడారు.
తండ్రికి ప్రత్తి మిల్లు ఉండేది.ఈపిల్లాడు బడిఎగ్గొట్టిమేనమామ ఇంటికి పారిపోయే వాడు.ఐదో ఏంటి తల్లి చనిపోవడంతో ఆపసివాడి మనసు గాయపడింది.సవతితల్లి బానే చూసేది.కానీ
పిల్లాడికి తాతగారి ప్రభావం బాగా పడటంతో కవిత్వం సాహిత్యం ని బాగా చదివేవారు.ఆంగ్లకవి షెల్లీ అంటే అభిమానం తో ఆయువకుడు తన కలం పేరు షెల్లీదాసన్ అని పెట్టుకుని వ్యాసాలు రాశారు.
15వ ఏట7ఏళ్ళ చెల్లెమ్మ తో పెళ్ళి తండ్రి హఠాత్తుగా చనిపోటంతో పస్తులతో బతికారు ఆదంపతుల.
మేనత్త కాశీలో ఉంది.ఆమె దగ్గరకు వెళ్లి ఆయన అక్కడి కళాశాల ప్రవేశ పరీక్షలో ఫస్ట్ క్లాస్ లోపాసై
సంస్కృతం హిందీ ఆంగ్లం లో పాండిత్యం సంపాదించారు.1904లో నెలకి 17రూపాయలజీతంతో టీచర్ గా చేరి కవితలల్లి పేరు గాంచారు.కానీ దాన్ని వదిలేసి విలేఖరిగా సంపాదకునిగా కొత్త రంగంలో ప్రతిభచాటారు.
కానీ బెంగాల్ విభజన సమయంలో దేశ నాయకులతో పరిచయం సోదరినివేదిత ప్రభావం ఆయన పై పడింది.భారత్ భండారు అనే షాపు తెరిచి స్వదేశీ వస్తువులు అమ్మేవారు.మూడు దేశ భక్తి గీతాలు కరపత్రాలు గా ప్రచురించి ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించారు.
ఆయన గీతం ఓంశక్తి పరాశక్తికి ప్రతిరూపం గా
శ్రీకృష్ణుని   వర్ణించారు ఆయన.అన్నం వండాలని బియ్యం చేటలో పోసింది ఆయన భార్య.ఇంతలో 
పిచ్చుకలు వాలి తింటుంటే ఆనందిస్తున్న  భర్తని
చూసి బాధపడింది ఆమె.ఆపూట ఇద్దరికీ ఉపవాసమే.
హరిజనుల తో కల్సి తిరగడం భార్యచేయి పట్టుకుని
వీధుల్లో నడవటం చూసిన కడియం అనే గ్రామవాసులు ఆయన్ని అక్కడ నుంచి తరిమేశారు.
ఆరోజు మద్రాసుపార్ధసారధి గుడికి వెళ్ళి ఏనుగు కి రోజూలాగే పండు కొబ్బరి కాయ అందించారు.కానీ ఆఏనుగు కోపంతో ఆయనని తొండంతో చుట్టి గిరగిరా తిప్పి నేలపైకి విసిరేసింది.12సెప్టెంబర్1921లో తన 39వ ఏట
 అమరులైనారు.దేశభక్తుడు కవి చిత్రకారుడు గాయకుడు నవలాకారుడు బాలలకోసందేశభక్తి దైవభక్తి బోధిస్తూ రాసిన గీతాలు నేటికీ అలరిస్తున్నాయి🌷
కామెంట్‌లు