బాల్యమెంత అందం...
బాల్యమెంత ఆనందం...
బాల్యమెంత ఉల్లాసం...
. బాల్యమెంత ఉత్సాహం !
ఆ బాల్యానందం పొందుటకేనా
ఆ ఆనందం అందించుటకేనా
నీచిలిపిచేష్టలచూపించుటకేనా
అందుకేనా కృష్ణా అందుకేనా...
నువ్వో రాజుకు కొడుకువైనా
జైలులో బంధీవై పుట్టినా...
రేపల్లెకు చేరినావు... గొల్లలతో కూడినావు... !?
గోప బాలుడవైనీవు గోపాలురతో ఆడినావు ...
ఆలమంద కాచినావు !
వెన్నదొంగవైనీవు, మాయలెన్నొ చేసినావు, గోపెమ్మల నాట పట్టించినావు !
పూతనాది రక్కసులను..
ఎందరినో చంపినావు..
గోవర్ధన నెత్తి నీవు...
అచ్చెరువొందించినావు !
అల్లరి పను లెన్నొ జెసి....
అమ్మను ఆడించి నావు
మట్టి తిన్న నోటనే..
అమ్మకు, సకల సృష్టి జూపినావు !
నిర్మలమౌ బాల్యానందం
నిష్కల్మష యాదవులలోనే దొరకుననా... కృష్ణా....,
నీబాల్యము నంత నీవు...
రేపల్లెలో... యాదవునిగ...
బ్రతికినావు... !!
ఇది ఈ యాదవుల ఎన్నెన్ని జన్మల పుణ్యఫలమొకదా !
ఆ అదృష్టము యాదవులదా..
ఆ స్వచ్ఛమైన ఆనందం తనివితీరా అనుభవించిన నీదా కృష్ణా.... !?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి