శంఖాల్లా మెలిదిరిగిన మెత్తనిచేతులలో ఏం దాచుకొచ్చావు?ఆల్చిప్పల్లాటి అందమైన నీలికన్నుల్లో ఏ కలను తెచ్చావు?ఏ దేవునికి దూతవునీవుమాకేం చెప్పాలని వచ్చావు?బోసి నవ్వుల్లో బ్రహ్మాండాన్ని చూపించిచక్రాల్లాగా కళ్లను తిప్పుతూఏదో చెప్పాలని చూస్తావుఅర్థం చేసుకోలేని అజ్ఞానులమనిముఖమంతా విప్పి నవ్వుతావు కదూ!ఎందరు నిన్ను ఎత్తుకున్నా-అమ్మ స్పర్శ తాకగానే ఆదమరచి పోతావుఅమ్మ మాట వినగానే అన్నీ మరిచిపోతావుఎక్కడ నేర్చావీ విద్య నీవు....?ఉంగా ఉంగా భాష లో ఎన్నో కథలు చెప్తావుహుక్కూ హుక్కూ అంటూ పాటలు పాడుతావుచిట్టి బొజ్జలో చిరు ఆకలి చిటికెడు పాలతో తీరెచిన్ని కనులకు నిదుర అమ్మ జోల తో సరి!మొగ్గల వంటి పాదాలతో ముందడుగేయిబంగరు భవితకు బాట వేయిఅందని ఎత్తుకు బావుటా ఎగిరేయి***
శిశువు......!!------శ్రీమతి సుగుణ.అళ్లాణి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి