1947 ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య సమర యోధులు పోరాటంతో సాధించిన అమరవీరులు ఎందరో ప్రాణత్యాగాలను చేసి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు.
పంద్రాగస్టు అంటే శ్రీరంగ జెండా ఎగురవేయడం అని అందరికీ తెలుసు. ఆ జెండా రూపకల్పన పింగళి వెంకయ్య గారు. ఆ మూడు రంగుల జెండాను ఆనాటికి ఈనాటికి ముచ్చటగా పదిలంగా పవిత్రంగా నిలబెట్టడం జరిగింది.
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఆంధ్రుడు కావడం తెలుగు వారందరికీ గర్వకారణం. ఈయన కృష్ణాజిల్లా 1876లో దేవి తాలూకా బట్ల పెనమర్రు లో జన్మించారు. కృష్ణాజిల్లాలో ప్రాథమిక ఉన్నత విద్యనంతరం సైన్సులో చేరాలనే కోరికతో 19 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికా. వెళ్లారు. అక్కడే గాంధీజీతో పరిచయమైంది దక్షిణాఫ్రికా నుండి తిరిగివచ్చి మద్రాసులో ప్లేగు వ్యాధి నిరోధక ఇన్స్పెక్టర్గా శిక్షణ పొంది బళ్లారిలో లేదు వ్యాధి నిరోధకాధికారికా పనిచేశారు. ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం కొరకు కొలంబో వెళ్లారు. తర్వాత జపనీస్, సంస్కృతం ఉర్దూ భాషల అధ్యయనం చేశారు. 19 16 లో కలకత్తాలో బ్రిటిష్ వారి జెండా ఎగురువేస్తే ఎంతో కలత చంది ఠాగూర్, తిలక్, నౌరోజీలను కలిసి తన అనుభవాలను క్రోడీకరిస్తూ ఏం నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే గ్రంథం రచించారు. 19 16 లో లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభల్లో గాంధీజీ కోరికపై మూడు గంటల్లో వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాను సూత్రప్రాయంగా ఆమోదించారు. ప్రజలు ప్రజలు ఈ జెండాను ఎగురవేసి బ్రిటిష్ వారి దాడికి గురయ్యారు. అయితే స్వాతంత్ర అనంతరం రాజ్యాంగ సభలో దీనిని ఆమోదించినప్పుడు మధ్య రాట్నం బదులు అశోకుని ధర్మ చక్రం నుంచి ఆమోదించారు. దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన పింగళి వెంకయ్య తన చివరి రోజుల్లో దుర్భర దారిద్రంతో కాలం వెళ్ళబోసుకొని 1963 లో పరమపదించారు. వెంకయ్య గారు మన మధ్య లేకపోయినా ఆయన తయారు చేసిన జెండా మాత్రం ఇప్పటికీ చిరస్థాయిగా దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న దుర్గాబాయి దేశ్ముఖ్, ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు, కొండా వెంకటప్పయ్య గారు కాశీనాథ్ నాగేశ్వరరావు గారు, గాంధీ నెహ్రూ లాంటి ఎండలో స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం ప్రాణాలర్పించి మనకు స్వాతంత్రాన్ని తెచ్చి పెట్టిన మహానుభావులు. అలాంటి వారిని ఈ రోజున తప్పకుండా స్మరించుకోవడం మన కర్తవ్యం. బ్రిటిష్ వారి కి ఎదురు తిరిగి ఉప్పు సత్యాగ్రహంతో శాంతి అహింసలతో పోరాడి జైలుకు వెళ్లి లాఠీ దెబ్బలు తిని తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు. అటువంటి మహా దేశభక్తులు ఎందరికో అందరికీ నివాళులు అర్పించుకుందాం.
హే రామ్ అంటూ నేలకొరిగిన బాపూజీ నీ మరోసారి గుర్తు చేసుకుందాం. వందేమాతరం అంటూ తుపాకీ గుండుకు ఎదురోడ్డున అల్లూరి సీతారామరాజు వంటి వీరున్ని త్యాగ ఫలితాన్ని ఆంధ్రుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన సమరయోధుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దాస్తీకానికి బలైపోయినా అమరవీరునికి నివాళులర్పించుదాం. నివాళులు.
జై భారత మాత.
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
త్రివర్ణ పతాకం- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి