పెన్నును ఎలా కనుగొన్నారు?;-ఎస్ మౌనిక

  హలో!హాయ్ మై డియర్ ఫ్రెండ్స్.....ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ.... మరి మీరు? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే!🤝🤝 మనం ఏదైనా రాయడానికి ముఖ్యంగా ఉపయోగించేది పెన్ను....పెన్ను అంటే కలము. కలము నేటి ఆధునిక రూపం ధరించడానికి కొన్ని వేల సంవత్సరాల సమయం పట్టింది. కలమును ఎలా కనిపెట్టారో మీకు తెలుసా? పూర్వకాలంలో మానవుడు గుహలలో నివసించేటప్పుడు, మొనగల వస్తువులతో గుహ గోడల మీద బొమ్మను, గీతలను గీసేవాడు. కొన్ని మొక్కల రసంలో లేదా జంతువుల రక్తంలో వేలు ముంచి రాసేవాడు. తర్వాత రేగడి సున్నపురాయిని ఉపయోగించి కూడా రాసేవాడు. చైనా దేశస్తులు ఒంటెల వెంట్రుకలతో చేసిన కుంచెలని వాడే వారట! బహుశా ఈజిప్టు వారు మొదటిసారిగా కలమును తయారు చేశారు. రాగిని చిన్న కర్ర ముక్క బిగించి రాసేవారు.మొదటిసారిగా గ్రీకుదేశంలో 4000 ఏళ్ల క్రితం పెన్నుతో రాయడం ఆరంభమైంది. గ్రీకులు ఏనుగు దంతంతో చేసిన పెన్నుతో మైనం ముక్కల మీద రాసేవారు. మధ్యయుగంలో కాగితం కనిపెట్టాక పక్షి ఈకలతో రాయటం మొదలుపెట్టారు.ఈనాడు మనం అనేక రకాలైన కళములను బజారులో చూస్తున్నాను. ఇది రాయడానికి ఎంతో వీలుగా ఉండి రాతలు ఒక కళగా మార్చింది. కొంచెం కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్...... మనం మళ్లీ ఇంకో కొత్త విషయంతో త్వరలో కలుద్దామా?? ఉండనా మరి!.... బాయ్ ఫ్రెండ్స్  👋..... త్వరలో మీ ముందు ఉంటా.....
కామెంట్‌లు