పిడుగు ఎందుకు పడుతుంది?;- ఎస్ మౌనిక

 హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ..... మరి మీరు? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే!....🤝 ఈరోజు ఇంకో కొత్త అంశంతో మీ నేస్తం మీ ముందు ఉంది. అదేంటో తెలుసుకుందామా? ముందుగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఉరుములు మెరుపులు మేఘాలలో ఒకేసారి పుట్టినా కూడా మనం మెరుపును ముందు చూస్తాము ఎందుకు? ముందు కళ్ళు తర్వాత చెవిలో ఉన్నాయని మాత్రం చెప్పకండి..... ఎందుకంటే శబ్దం కన్నా కాంతి అతివేగంగా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఉరుములు మెరుపులతో పడే పిడుగులు ఎంతవరకు అపాయకరం అనే ప్రశ్న కలుగుతుంది. పిడుగు ఎప్పుడో కానీ భూమ్మీద పడదు. కానీ పిడుగు పడి కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. మేఘాలు ఉరమగానే ప్రకాశంవంతమైన చార ఏర్పడుతుంది.నిజానికి ఈ చార మేఘాల మధ్య కానీ లేకపోతే మేఘములకు భూమికి మధ్య కానీ ఏర్పడుతుంది. విద్యుత్ భరితమైన మేఘం భూతలాన్ని సమీపించగానే, వ్యతిరేక విద్యుత్ ద్రవం ఉత్పత్తి అవుతుంది.ఈ రెండింటి మధ్య తేడా(potential difference)గాలి నిరోధక శక్తికి మించినప్పుడు గాలి ద్వారా విద్యుత్ భూమి మీదకు ప్రవహిస్తుంది. ఫలితంగా పిడుగు పడుతుంది. అలాగే విద్యుత్ భరిత మేఘాలు ఒకదానిని ఒకటి సమీపించగానే పిడుగు ఉద్భవిస్తుంది. చాలా కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్! ఇటువంటి ఎన్నో కొత్త విషయాలను మీ నేస్తం ఎప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటుంది! మనం మళ్లీ త్వరలో కలుద్దామా ఫ్రెండ్స్ ఇంకో కొత్త అంశంతో!.... బాయ్ ఫ్రెండ్స్!👋
కామెంట్‌లు