హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ.... మరి మీరు? విష్ యు వెరీ హ్యాపీ డే!🤝🤝... ఇంకో కొత్త విషయంతో మీ నేస్తం మీ ముందుంది. అదేంటో తెలుసుకుందామా? మీరు రెడీనా మరి? గాలిని కొలవాల్సిన అవసరం ఏంటి? అసలు గాలిని ఎలా కొలుస్తారో మనం ఈరోజు తెలుసుకుందాం. గాలి వేగాన్ని కొలిచే సాధనాన్ని 'అనిమోమీటర్ 'అంటారు. దీన్ని 1667లో రాబర్ట్ కానీ ఇంగ్లీష్ శాస్త్రవేత్త కనిపెట్టాడు. అనిమోమీటర్లలో అనేక రకాలు ఉన్నాయి. ఈరోజుల్లో వినియోగంలో ఉన్న అనేక అనిమోమీటర్లలో చిన్న అల్యూమినియం కప్పులు ఒక ఇరుసుకు అమర్చి ఉంటాయి. గాలి తగలగానే ఈ కప్పులు తేలిగ్గా తిరుగుతాయి. గాలి వేగం ఎక్కువైన కొద్దీ ఇవి మరీ వేగంగా తిరుగుతాయి. ఈ సాధనానికి ఉండే మీటరు కప్పులు తిరిగే వేగాన్ని తెలుపుతుంది.ఈ మీటర్ పై ఉన్న కొలతల ద్వారా గాలి వేగం తెలుస్తుంది. గాలి వేగాన్ని కొలవాల్సిన అవసరమేంటని మీకు అనిపించవచ్చు? మానవుడు విమానాలలో ఎగరడం ప్రారంభించగానే అతనికి గాలి వేగం తెలుసుకోవడం ఎంతైనా అవసరమే కదా .మొదట్లో గాలి గుమ్మటాలను ఎగరవేసి గాలి వేగం తెలుసుకునేవారు. గుమ్మటాలు అంటే గాలిపటాలు.అయితే అనిమో మీటర్ కనిపెట్టిన తర్వాత గాలి వేగాన్ని కనుక్కోవడం సులువు అయింది.ఈ రోజుల్లో ప్రతి విమానంలోనూ అనిమోమీటర్ను అమర్చి ఉంటారు.అంతేకాదు గాలి వేగం తెలుసుకోవడం వాతావరణ పరిశోధనకు కూడా ఎంతో ముఖ్యం. రాబోయే వాతావరణన్ని ముందుగా తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కొంచెం కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్! ఇటువంటి ఎన్నో కొత్త విషయాలను మీ నేస్తం మీ ముందుకు తెస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్! మనం మళ్ళీ త్వరలో కొత్త విషయంతో కలుద్దాం ఫ్రెండ్స్! బాయ్ ఫ్రెండ్స్! ఉంటా మరి!.... 👋
గాలి వేగాన్ని ఎలా కొలుస్తారు?;- ఎస్ మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి