న్యాయాలు -232
లోహాగ్ని న్యాయము
****
లోహము అంటే ఎఱ్ఱనిది రాగిది ఇనుపది ఉక్కు బంగారము నెత్తురు ఆయుధము గాలము ఎఱ్ఱ మేక వంటి అర్థాలు ఉన్నాయని మనకు తెలుసు.
అగ్ని అంటే నిప్పు లేదా మంట.
అగ్ని సాహచర్యం వలన లోహము కూడా అగ్ని ధర్మములను కలిగి వుండటం అని అర్థం.
అగ్ని గురించి చెప్పుకునేటప్పుడు ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లయితే... పంచ భూతాలలోని అగ్ని మన శరీరంలో కూడా ఉంటుందనీ, మానవ శరీర నిర్మాణంలో అగ్నిది కూడా ముఖ్యమైన పాత్రనీ, మనిషి ప్రాణాలతో ఉండాలంటే దేహంలో అగ్ని కూడా ఉండాల్సిందేనని మనకు తెలుసు.
మరి అలాంటి అగ్నితో లోహము కలిస్తే తప్పకుండా లోహము అగ్ని యొక్క వేడిని, లక్షణాలను పొందుతుంది.వివిధ లోహాలతో తయారు చేసిన పాత్రలను పాత్రలను వేడి చేసి మనం వంట చేసుకుంటాం.అంటే అగ్ని వలన లోహానికి సార్థకత కలిగింది. అయితే ఇది సామాన్యమైన దృష్టి కోణము.
మరి ఆధ్యాత్మిక దృష్టి కోణంలోంచి చూస్తే...
అగ్నితో కలవడాన్ని సజ్జన సాంగత్యంగా చెప్పబడింది.
ఈ న్యాయమునకు దగ్గరగా, తాత్విక దృష్టితో రాసిన వేమన పద్యాన్ని చూద్దాం.
'పర(రు)సమినుము సోకి బంగారమైనట్లు/ కప్పురంబు జ్యోతి గలసినట్లు/ పుష్పమందు తావి పొసగినట్లగు ముక్తి/ విశ్వదాభిరామ వినురవేమ!"
పరుసవేది దీనినే స్పర్శవేది అని కూడా అంటారు.(ఇది ఒక ప్రత్యేకమైన మూలికా రసము.దీనిని ఏం లోహమునకైనా తాకిస్తే ఆ స్పర్శకే ఆ లోహము మెరిసే బంగారంగా మారుతుంది.)ఈ పరుస వేది వలన తక్కువ విలువైన ఇనుము ఎక్కువ విలువైన బంగారంగా ఎలా మారుతుందో, కర్పూరము అగ్నితో కలిసి ఎలా చక్కగా ప్రజ్వలిస్తుందో,అలా మానవుడు తనలోని జీవాత్మను పరమాత్మతో అనుసంధానము చేయటం వలన పుష్పములో పరిమళము పొందుపరచ బడినట్లు, పుష్పానికి తావి అబ్బినట్లు ముక్తి లభిస్తుంది " అంటారు."
అనగా ఈ పద్యంలో అగ్నిని మంచికి, పరమాత్మకు చిహ్నంగా, భావించడం జరిగింది. అగ్నితో సాహచర్యం వలన కర్పూరం చక్కగా వెలిగి తన యొక్క సువాసన వెదజల్లుతుందనీ, ఇనుము లాంటి మానవుడు పరుసవేది లాంటి మంచితనంతో కలవడం వలన మెరిసే బంగారంలా ఉన్నతంగా రాణిస్తాడనీ, పువ్వుకు పరిమళం అబ్బినట్లుగా జీవితాన్ని చరితార్థం చేసుకుంటాడని అర్థం.
కాబట్టి ఈ "లోహాగ్ని న్యాయము" లోని అంతరార్థం తెలుసుకుని సజ్జనులతో, మానవీయ విలువలతో స్నేహం చేసి, అలా వారిలా జన్మను సార్థకం చేసుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి