పలకరింపుగా నవ్వి
ఆహ్వానించే ఎర్రదనం
తొలికిరణాలవెలుగులో
అలుముకునే వెలుగురేఖలు
రంగుమార్చుకుని నూతన
శోభల వెలిగే నీలిగగనం
మనసులోని మౌనాన్ని
మందహాసంగా మార్చే అందం
ప్రభాకరుడి ఆగమనవేళ
పరవశించి పులకరించే ప్రకృతి
కొత్తవెలుగులు పంచుతూ
కొత్త దారులు చూపే
కొత్త ఉదయాన్ని....
కొంగొత్తగా స్వాగతించి
కోరిన సాంత్వన
కొంగునిండా నింపుకుని
కొదవలూ కలతలూ లేక
కొసరికొసరి ఆనందాలు పంచుతూ
కమ్మగ సాగే బ్రతుకులోని
మరో కమనీయమైన వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి