న్యాయాలు -225
లతా వృక్ష న్యాయము
******
లత అంటే తీగ, కొమ్మ,మాధవీ లత అనే అర్థాలు ఉన్నాయి.వృక్షము అంటే చెట్టు.
చెట్ల అండ ఉంటేనే తీగలు నేలపై పడకుండా చక్కగా పైపైకి పాకుతాయి అనే అర్థం.
మనందరం నిత్య జీవితంలో వీటిని చూస్తూనే ఉంటాం. ఇంట్లో, పెరట్లో ఆకుకూరలు, కాయగూరలు పండించుకునే వారికీ,పూల మొక్కలు పెంచుకునే వారికి తీగజాతి వాటిని పెంచే విధానం తెలిసే ఉంటుంది.వాటిని పక్కనే ఉన్న చెట్టుకు పాకేలా చేయడమో,పందిరి వేసి పాకించడమో చూస్తుంటాం.
అయితే 'పిల్లలూ, స్త్రీలు కూడా పెద్దలూ, కుటుంబం అండ వుంటేనే చక్కగా ఎదుగుతారు' అనే అర్థంతో ఈ "లతా వృక్ష న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
బీర, పొట్ల, కాకర, సొర,దోస ,గుమ్మడి మొదలైన కాయగూరలూ, ద్రాక్షతో పాటు,మల్లె,జాజి, విరజాజి మొదలైన పూల తీగలు ఏవైనా మంచిగా పాదు చేయబడి అవి పాకడానికి సరైన పందిరి వేయాలి .అప్పుడే చక్కగా పైపైకి ఎదుగుతాయి.అలా వాటిని సంరక్షణ చేయక పోతే సరిగా ఎదగక చెల్లాచెదురైపోతాయి.
అయితే మహిళను తీగతో పోల్చుతూ కుటుంబమనే పందిరికి అల్లుకు పోయే మల్లెతీగ వంటిదని అర్థం వచ్చేలా, ఆమె గొప్పతనం,త్యాగ గుణం తెలిసేలా ప్రముఖ ఉద్యమ కవి, సినీ కవి అయిన దాశరథి కృష్ణమాచార్య గారు ఓ సినిమా కోసం రాసిన పాటను చూద్దాం."మల్లెతీగ వంటిది మగువ జీవితం/ చల్లని పందిరి వుంటే అల్లుకు పోయేను"అంటూ చక్కని పాట రాశారు.
మరో ఉదాహరణ చూద్దాం.మన భావోద్వేగాలు, ఆనందాలు, అనుభూతులు పంచుకునేది,మానవీయ విలువలు నేర్చుకునే పవిత్రమైన ప్రదేశం ఇల్లే.
అందుకే ఇల్లును ఆనందాల హరివిల్లు.మమతల పందిరితో అల్లుకున్న పొదరిల్లు అంటాం.
కష్టాలు, బాధలతో విలవిల్లాడుతూ, చిగురుటాకులా వణికే వేళ లత లాంటి మన హృదయాన్ని హత్తుకుని ధైర్యాన్ని ఇచ్చే వృక్షము ఇల్లే.
ఇలా ఈ న్యాయమును మొక్కలకే కాకుండా మానవ జీవితానికి అన్వయించి చూసినట్లయితే లేలేత లతల్లాంటి బాల బాలికలనూ పైపైకి పాకుతూ ఎదిగేలా చూస్తూ ,అన్ని వేళలా ఆలంబనగా నిలిచేదే కుటుంబమనే వృక్షము.
ఈ "లతా వృక్ష న్యాయము" సదా గమనంలో ఉంచుకొని కుటుంబము, ఇల్లు అనే వృక్షాన్ని,ఆ వృక్షాన్ని ఆలంబనగా చేసుకొని పెరిగే సంతానాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. మంచి ఫలాలను సమాజాన్ని అందిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి