శ్రావణ లక్ష్మి! అచ్యుతుని రాజ్యశ్రీ
శ్రావణ లక్ష్మి రావమ్మా! 
సకల శుభాలను తేవమ్మా
మంగళగౌరి గా వెలసితివీ
వరలక్ష్మి గా బ్రోచితివీ

పసుపు పాదాలతో పరవశింప
ఎర్రని గోరింట తో అమ్మ చేతులు అభయమొసగా
తాంబూల రంజిత అధరాలతో
తల్లీ వరలక్ష్మీ రావమ్మా

శివ కేశవులకు భేదము లేదు
శ్రావణసోమ శివునికి ప్రీతి
విష్ణువల్లభా!చారుమతిని బ్రోచితివీ

గంధపుపూతల డెందము పరిమళ సుగంధము
నవ్వులచేమంతులతో
మందమంద మృదుహాసము చిందగా రావే తల్లీ రావమ్మా
 మముబ్రోవగా నీవే నమ్మా

ముగ్గురమ్మల మూలపుటమ్మా
ఆదిశక్తి పరబ్రహ్మవమ్మా
ఘల్లు ఘల్లు నా గజ్జెలు మ్రోయ
గాజుల గలగలలు సందడిసేయ🌷

కామెంట్‌లు