~పొడుపు పద్యాలు~ (ఆటవెలది ) - కరణం మాణిక్ రావు- తాండూరు, వికారాబాద్ జిల్లా

 1.
ముచ్చటైన పదము మూడక్షరమ్ములు
ఒండు,మూడు చేత నొప్పు శిక్ష
చివరి రెండు చదువ సంపద యే యగు
విప్పి జెప్ప వోయి! వింత పొడుపు !
2.
నరులకున్న పదము నాలుగక్షరములు
ఒండు,మూడు చదువ పండు కాదు
రెండు,నాల్గు గూర్చి చూడగా లేరను
విప్పి జెప్ప వోయి! వింత పొడుపు !
3.
నాలుగక్షరముల మేలైన పదముండు
రాక మొదటి,రెండు రాజ్య మగును
చివరి రెండు చూసి చెప్పగా నాథుడు
విప్పి జెప్ప వోయి! వింత పొడుపు!
4.
అరయు మాట కొరకు నైదక్షరమ్ములు
కోర చివరి మూడు "మిరప ఘాటు"
మొదటి, రెండు చదువ నొదవు "తామసి"యగు
విప్పి జెప్ప వోయి! వింత పొడుపు !
5.
నరుల మెచ్చు తలము నాలుగక్షరములు
ఒండు,మూడు‌ గనగ నొప్పు వాంఛ
రెండు, నాల్గు గూర్చి జూడ అన్య పదము
విప్పి జెప్ప వోయి !  వింత పొడుపు !
•••••••••••••••••••••••••••••••••••••
👉జవాబులు:-1.ఉసిరి 2.కాలేయము 3.రాష్ట్రపతి 4.అంధకారము 5.ఆకాశము
కామెంట్‌లు