జీవితం చాలా చిత్రమైనది. ఒడుదొడుకులు, ఆరాటం, పోరాటం మనిషి మనసును మధించి అశాంతికి గురిచేస్తాయి. గెలుపు, ఓటములు, కష్టసుఖాలు ఉంటాయి. మనసును సమాధానపరచుకొని ముందుకు సాగాలి. మనసు కట్టించగలిగితేనే మనిషి విజయం సాధించినట్లు అని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు!
మనసును అదుపులో పెట్టడం అంత సులభం కాదు. దానికి తగిన సాధన చెయ్యాలి. మనసును జయించడానికి ముందు ఇంద్రియ నిగ్రహం అలవరచుకోవాలి. మనసును మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. అంతేకాని, దాని చేతుల్లో కీలుబొమ్మ కారాదు. అభ్యాస వైరాగ్యాల ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చని భగవద్గీత తెలియజేస్తోంది.
మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడిగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయ లోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీతతో సహా ఇంచుమించు ఇతర మతగ్రంథాలన్నీ ప్రబోధించాయి. మనస్సును జయిస్తే చాలు. ముల్లోకాలను జయిస్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేవి అదుపులో ఉంటాయి. దుర్గుణాలు సద్గుణాలుగా మారి శాంతి సౌఖ్యాలనిస్తాయి.
మనోనిగ్రహం లేని మనిషి ఆత్మతత్త్వం తెలుసుకోలేక సంసార బంధంలో పదే పదే చిక్కుకుంటున్నాడు. జ్ఞానంతో, మనోనిగ్రహంతో పరిశుద్ధుడైన మనిషి పుట్టుకను తిరిగి పొందక పరమపదాన్ని చేరుకోగలడు.
సత్యం ,సంతోషం , సమదృష్టి , సదసద్వివేకం, శౌచం, క్షమ, దయ, మార్దవం,మనోనిగ్రహం, మహాజనసేవ, మితభాషిత్వం, ఇంద్రియజయం, బ్రహ్మచర్యం, ప్రతిప్రాణిలోను పరమాత్మను చూచుట, దానం, అభేదబుద్ధి తో నుండుట, ఉపవాసాదికం, అహింస, ఆత్మావలోకనం , అన్నోదకాలను పంచిఇవ్వడం, అసభ్య వాంఛలు,అనర్ధకమైన క్రియలు విడిచిపెట్టడం, దేవదేవుడైన ఆ శ్రీమన్నారాయ ణుని చరణాలను స్మరించడం, కీర్తించడం, కథాశ్రవణం,సేవ, ఆరాధనం, నమస్కృతి, దాస్యం, సఖ్యం, ఆత్మ సమర్పణం అనే ముప్ఫై గుణాలను మానవులు విధిగా అలవరచుకోవాలని నారదుడు తన ఆశ్రమ ధర్మాలలో చెప్పారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి