పిలియాస్! అచ్యుతుని రాజ్యశ్రీ

అయోల్కస్ రాజ్యంని పాలించే పిలియాస్ చాలా చెడ్డవాడు.జేసన్ తండ్రిని జైల్లో పెట్టి సింహాసనం ఎక్కాడు.అందుకే జేసన్ ఆరాజ్యంకి చేరగానే అంతా అతడ్ని వింతగా చూస్తూ ఉన్నారు.కారణం అతని ఓకాలిచెప్పు ఎక్కడో పడిపోయింది.అలా ఎవరైనా ఒకే ఒక్క చెప్పుతో రాజ్యం లో కి వస్తే దానికి రాజు అవుతాడని వారినమ్మకం.పిలియాస్ కి ఇది తెలిసి తన రాజసభకిపిలిపిస్తాడు." మానాన్న రాజ్యం ఇది.నాది" అన్న జేసన్ తో"సరే కోల్చిస్ రాజ్యం లోని బంగారు జూలు తీసుకుని రా" అని ఆదేశించాడు పిలియాస్.మరి మన జానపద కథలు సినిమా లలో మాంత్రికులు చెడ్డ రాజులు ఉన్నట్లే గ్రీకు కథల్లో కూడా ఉన్నారు 🌹
కామెంట్‌లు