నింగినెగిరిన సంబరం
రంగులు వెదజల్లే అంబరం
నెలరాజుని తాకిన తరుణం
వెలలేనిది అపురూప క్షణం
జగతిని మిన్నగ నిలిచి
జాతికి గర్వము నిచ్చి
ముచ్చటగా ఊయలలూగె
మూడురంగుల విజయపతాక
భారత సంతతి మునిగెను
సంతస సంద్రమున
కష్టపడిన విజ్ఞానుల నగవుల
చూసి మురిసెను భారతమాత
విజయ దరహాస చంద్రికల
తడిసిన దేశవాసుల చూసి
పున్నమి వెన్నెల వానలు
కన్నుల నింపెను జాబిలి
జగమునందు గొప్పగా
చరిత్ర లిఖించి నిలిపిన
భరతమాత ముద్దుబిడ్డల
మురిపించి ముద్దులు కురిపింప
కదిలివచ్చిన కర్మసాక్షికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి