కాలం
కలసిరానపుడు
తాడేపామై
కాటువేస్తుంది
సమయం
అనుకూలించనపుడు
మిత్రులే
శత్రువులవుతారు
క్షణాలు
ప్రతికూలమైతే
కన్నకలలు
ఆవిరైపోతాయి
నిమిషాలు
నియంత్రించకపోతే
నట్టేటిలో
ముంచేస్తాయి
గంటలు
దుర్వినియోగంచేస్తే
జీవితం
వ్యర్ధమువుతుంది
రోజులు
బాగాలేకపోతే
జీవితం
వ్యర్ధమవుతుంది
సమయం
సద్వినియోగపరచుకో
సాఫల్యాలను
సాధించు
కాలచక్రం
గమనిస్తుండు
సమయానుకూలంగా
ప్రవర్తిస్తుండు
లేకపోతే
ఓడిపోతావు
అపజయాలు
మూటకట్టుకుంటావు
నిత్యం
గమనిస్తుండు
లక్ష్యాలవైపు
అడుగులేస్తుండు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి