ఓణం! అచ్యుతుని రాజ్యశ్రీ
పదిరోజుల పంటలపండుగ
కేరళలో చింగంలో మహాబలి కి
స్వాగతం పలుకుతూ
రంగు రంగుల ముగ్గులు పూలు అలంకరణ లో పులకించే ప్రతిహృదయం
సర్పాకారంలో పడవలపందాలు
అరటి ఆకులలో కమ్మని వంటకాలు

మహాబలి అంటే గొప్ప త్యాగం
ప్రహ్లాదుడి మనవడు
బుడిబుడి నడకల వామనుని
కోరిక పై చేసే త్యాగం
ఓణంరోజు బలి పైకొచ్చు
తేనె ప్రజలు తనివితీరా చూసి ఆనందించు
ఏనుగుల ఊరేగింపు
ఊయలలూగే ఉత్సాహం
వామనవిగ్రహం ప్రతిష్ఠ
మతాల పూతలులేక
ఐకమత్యం తో సాగే పండుగ

కామెంట్‌లు