సుప్రభాత కవిత ; -బృంద
ణాలెన్నైనా
అపరంజి ఒకటే
అరవిందాలెన్నైనా
అర్చన ఒకటే!

ఏ మబ్బు ఏ శిఖరాన
కురిపించినా  
కురిసే నీరు ఒకటే
దాని పరుగు పల్లం వైపే!

ఏ వైపు ఎన్ని అలలు
ఎంత వేగంగా సాగినా
తిరిగి చేరుకునేది
సంద్రపు ఒడిలోకే!

ఏ పక్షి ఎంత ఎత్తు ఎగిరినా
తిరిగి చేరుకునేది
చెట్టు మీద కట్థుకున్న
తన గూటి ఇంటికే!

ఎంత ఎత్తు ఎదిగినా
ఎన్ని శాఖలు విస్తరించినా
వృక్షపు మూల ఆధారం
నేల లోపలి పొరలే!

ఎంత సంపద ఉన్నా
ఎంత బలగమున్నా
ఊపిరాగిపోయాక
అందరిదీ గమ్యమొకటే!


కోటి నదులు ధనుష్కోటిలో
కలిసినట్టు
అందరం అంతర్యామిలో
కలవ వలసిందే!

అంతవరకూ సాగే
జీవిత వాహినిలో
ప్రతిరోజూ అమూల్యమే
ప్రతి ఉదయం శుభోదయమే!

ఆయురారోగ్యాలూ
అష్టైశ్వర్యాలూ
అందరికీ అందేది
ఆదిత్యుని అనుగ్రహంతోనే!

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు