నిశీధిలో మైమరచి
నిద్రపోతున్న జగతిని
తను రాకనే నిదరోయిన పిల్లలను
ప్రేమగా తలనిమిరే తండ్రిలా
కిరణాలతో నులివెచ్చగా
వెలుగులతో ఆప్యాయంగా
మగత నిదురలోని పృథ్విని
స్పృశించి ప్రేమగా మేల్కొలిపి...
అనునయ ఆలింగనాలు
ఆత్మీయ చుంబనాలు
కర్తవ్యబోధలు....చేసి
కార్యోన్ముఖం గావించి
చేయిపట్టి నడిపించి
వెన్నుతట్టి నిలబడే
కన్నతండ్రి తీరున
కరుణ కురిపించు కర్మసాక్షి
రాబోయే మార్పులు
ఇవ్వబోయే తీర్పులూ
పయనపు కూర్పులూ
బంధాల చేర్పులు
ఏమీ తెలియక సాగే
బ్రతుకు బండిని
సన్మార్గమునకు చేర్చే
కోలాహలమైన కొత్త వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి