హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు?నేనైతే ఫుల్ హ్యాపీ.... మరి మీరు? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే... 🤝 ఈరోజు మీ నేస్తం కొత్త విషయంతో మీ ముందు ఉంది. అదేంటో తెలుసుకుందామా? మనం కొంచెం లోతుగా గమనిస్తే కొన్ని మేఘాలు వర్షించకుండానే వేరే చోటికి వెళ్ళిపోతాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఈరోజు తెలుసుకుందామా?... సూర్యుడు వేడి వలన నేల మీద ఉన్న నీరు ఆవిరిగా మారి వాతావరణంలో కలుస్తుందని మనకు తెలుసు. వేసవికాలంలో అయితే నీరు త్వరగా ఆవిరి అయ్యి వాతావరణంలో కలుస్తుంది. వాతావరణ ఉష్ణోగ్రత ఏ ఏ మాత్రం తగ్గినా ఈ ఆవిరి నీటి బిందువులుగా ఘనీభవిస్తుంది. ఇలా గనిభవించిన చిన్న చిన్న నీటి బిందువులు లెక్కలేనన్ని ఉంటే దాన్ని మేఘం అంటాం. మేఘాలకు అడుగున చల్లగా ఉంటే మేఘాలలో ఉన్న నీటి బిందువుల పరిమాణం పెరుగుతూ ఉంటుంది. కొంత పరిమాణం వరకు పెరిగిన తర్వాత వాన రూపంలో భూమి మీద పడుతుంది. అలాగే మేఘాల కింద గాలి వేడిగా ఉంటే మేఘాలలో ఉన్న నీటి బిందువులు మరల ఆవిరిగా మారిపోతాయి. ఫలితంగా ఆ మేఘాలు వర్షించకుండానే వెళ్ళిపోతాయి. కొన్ని మేఘాలు వర్షించకపోవడానికి కారణం ఇదేనన్నమాట. కొంచెం కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్! ఇటువంటి ఎన్నో విషయాలను మీ నేస్తం మీ ముందుకు ఎల్లప్పుడూ తెస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్! మనం మళ్లీ త్వరలో కలుద్దామా ఫ్రెండ్స్?ఇంకో కొత్త అంశంతో! బాయ్ ఫ్రెండ్స్!👋
కొన్ని మేఘాలు వర్షించవు ఎందుకు?;- ఎస్ మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి