న్యాయాలు -236
వధూ మాష మాప న్యాయము
******
వధూ అంటే కోడలు, పెండ్లి కూతురు.మాష అంటే మినుములు, బంగారం.మాప అంటే కొలత, త్రాసు అనే అర్థాలు ఉన్నాయి.
భార్యను వద్దని ఇంటికి వచ్చిన యాచకులకు కోడలితో భిక్ష ఇప్పించడం అనే అర్థంతో ఈ న్యాయము చెప్పబడింది.
అయితే ఈ న్యాయమును నిశితంగా పరిశీలించి చూద్దాం.దానం ఇప్పించే అతడిలో దానగుణం ఉందా? లోభగుణం ఉందా ? ఈ కథ చదివితే అర్థమవుతుంది.
ఈ కథను చదువుతుంటే చాలా చాలా సరదాగా ఉంటుంది. "అరెరే లోభికి యిమ్మడి ఖర్చు అంటే ఇదే కదా! "నవ్వు కూడా వస్తుంది.
అనగా అనగా ఓ పిసినారి. ఇంటికి వచ్చిన యాచకులను కాదన కూడదని భార్య వారికి భిక్ష పెడుతుంటే ఏమీ అనలేక ఓ ఆలోచన చేశాడు.పిడికెడు కంటే ఎక్కువ ముష్టి వేయకూడదని కట్టడి చేశాడు.అయినా ఆమె చేతి పిడికిలి పెద్దదిగా ఉందనిపించింది అతడికి.ఇంట్లోంచి బోలెడంత ధాన్యం అలా భిక్షకులకు పోతోందని , అలా కాకుండా ఏం చేయాలో మళ్ళీ ఆలోచించాడు.
కొత్తగా వచ్చిన తమ కోడలు చిన్నమ్మాయి. ఆమె పిడికిలి చిన్నగా వుంటుందని భావించి ఆమెతో భిక్ష ఇప్పించ సాగాడు.
అయితే కోడలి పిడికిలి చిన్నదే కానీ ఆమె మంచితనం,మాట తీరు, ఆకర్షణీయమైన రూపం గురించి ఒకరి ద్వారా మరొకరికి తెలవడంతో యాచకుల సంఖ్య పెరిగింది.అలా వాళ్ళ వల్ల ఇంతకు ముందు కంటే ఎక్కువ మందికి ముష్టి వేయించాల్సి రావడంతో ,ధనం,ధాన్యం అధికంగా ఖర్చవడం మొదలైంది.
ఖర్చు తగ్గించుకోవడానికి భార్యను వద్దని కోడలిచే భిక్ష ఇప్పించినా ప్రయోజనం లేకపోయింది.తన ఆలోచన కాస్తా బెడిసి కొట్టింది.
అందుకే ఇలాంటి సంఘటనలు, సందర్భాలు చూసే మన పెద్దలు ఇలాంటి న్యాయాలను, సామెతలను సృష్టించారనిపిస్తుంది.
అలా లోభత్వం చూపే వ్యక్తి గురించి భర్తృహరి రాసిన సుభాషితం చూద్దామా...
"కృపణేన సమో దాతా న భూతో న భవిష్యతి|/అస్పృషన్నేవ విత్తాని యః పరేభ్యః ప్రయచ్ఛతి||/ కృపణేన సమో దాతా న భూతో న భవిష్యతి|"
కృపణుడు అంటే లోభి అని అర్థం. లోభితో సమానమైన దాత ఈ ప్రపంచంలో మరొక వ్యక్తి లేడట. గతంలో లేడట, భవిష్యత్తులో ఉండ బోడట.
అందులో ఎంత వ్యంగ్యం,మరెంత నిజం ఉందో మన చుట్టూ ఉన్న సమాజంలో ఇలాంటి కొందరిని చూసినప్పుడు అనిపిస్తుంది.ఇలా లోభత్వంతో ఆలోచించే వారి సంపద చివరకు, దొంగల పాలో రాజుల పాలో అవుతుందంటారు.
కాబట్టి లోభత్వం మానేసి మనం కష్టపడి సంపాదించిన ధనాన్ని మనం ఉపయోగించుకుంటూ, అనుభవిస్తూనే ఉన్నంతలో , చేతనైనంత ఇతరులకు సహాయం చేయాలని ఈ "వధూ మాష మాప న్యాయము ద్వారా గ్రహించవచ్చు. అంతే కదండీ!
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి