తొలి తరం నటి సీనియర్ శ్రీరంజని.;- : సేకరణ; డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు చెన్నై

 తొలుతనాటక సినీ రంగాలను పౌరాణికాలే శాసించాయి.నాడు సొంతంగా పద్యం,పాటపాడగలిగేవారిని ప్రజలు బాగా ఆదరించారు.నాటి నాటకరంగాన్నిపరీశీలిస్తే,భక్తప్రహ్లాద,పాదుకాపట్టాభిషేకం, సారంగధర,కురుక్షేత్రం, పాండవోద్యోగ విజయాలు,గయోపాఖ్యానం, రామదాసు,హరిశ్చంద్రవంటి నాటకాలు విరివిగా ఊరు వాడప్రదర్మింప బడుతుండేవి.(1931సెప్టెంబర్ 15)నవిడుదలైన ఏకైక చిత్రం "భక్తప్రహ్లాద" అదేదారిలో జనవరిమాసం (1932) లోవిడుదలైన"పాదుకాపట్టాభిషేకం" "శకుంతల" ఇక్కడ గమనించదగినవిషయంఏమిటంటే భక్తప్రహ్లాద భాగవతాంశ పరమైనది,పాదుకా పట్టాభిషేకం రామాయణాంశపరం, శకుంతల మహాభారతాంశము కావడం.విషేషం.
1933ఫిబ్రవరి4న హెచ్.యం.రెడ్డిగారి"సతిసావిత్రి"విడుదలైతే, అదేసంవత్సరంసి.పుల్లయ్యగారి"సతీసావిత్రి " పోటిగా విడుదల జరిగింది.పృద్విపుత్ర (ఇదిఏరకమోతెలియలేదు )చింతామణి చిత్రాలువచ్చాయి.
1934 లో "అహల్య" "లవకుశ" "సీతారామకల్యాణం"వచ్చాయి.1935 లో "శ్రీకృష్ణతులాభారం" "సక్కుబాయి" "కుచేల" "హరిశ్చంద్ర" "శ్రీకృష్ణలీలలు" "సతీఅనసూయ"ప్రమిలార్జునీయం""భక్తకబీరు"విడుదలయ్యాయి.1936లో "భక్తదృవ-అనసూయ,"(ఇది తొలిబాలలచిత్రం ) "ద్రౌపతి వస్త్రాపహరణం" " ద్రౌపతి మానసంరక్షణం""సులోచన" "వీరాభిమన్యు" "మాయబజా" "సతితులసి" "లంకాదహనం"తోపాటు అదే సంవత్సరంలో తొలితెలుగు సాంఘీకచిత్రం"ప్రమవిజయం"ఈచిత్రానికి "రాణిప్రేమలత" అనేమరోపేరుఉంది.1937 లో "బాలయోగిని" దశావతారాలు" "మోహినిరుక్మాంగద" "నరనారాయణ" "రుక్మిణికల్యాణం""విప్రనారాయణ""విజయదశమి""కనకతార"తొలిచారిత్రాత్మకచిత్రంగా"సారంగధర"గుర్తింపుపొందాయి.
ఆరోజుల్లోపౌరాణికచిత్రాలలో సురభికమలాబాయి ,కన్నాంబ, రామతిలకం, పుష్పవల్లి,ఋష్యేంద్రమణి, కోటిరత్నం, రాజరత్నం, కాంచనమాల,క్షత్రియపార్వతిబాయి,శాంతకుమారి వంటి పలువురు నటీమణులు నటించి తెలుగుచలనచిత్రసీమకు వన్నేతెచ్చారు.
 అదే కోవలో శ్రీరంజని (సీనియర్)గా ప్రసిద్ధి చెందిన మంగళగిరి శ్రీరంజని ప్రముఖ పాతతరం చలన చిత్ర నటి. ఈవిడ మరో నటి శ్రీరంజని (జూనియర్)కు అక్క, దర్శకుడు( గూఢాచారి 116) ఎం.మల్లికార్జునరావుకు తల్లి. 1906లో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో జన్మించింది. ఈవిడ 1920, 1930లలో గ్రామోఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా వారు విడుదలచేసిన నాటకాలను రికార్డులలో గాయనిగా తన ప్రైవేటు గీతాల ద్వారా ప్రసిద్ధి పొందింది. చిత్రాలలో నటించకముందు ఈమె పౌరాణిక నాటకాలలో అభిమన్యుడు, సత్యవంతుడు, కృష్ణుడు వంటి పురుష పాత్రలు వేసేది. అప్పట్లో ఆవిడ కృష్ణ విలాస నాటక సమాజంలో సభ్యురాలు. సి.పుల్లయ్య తీసిన లవకుశ (1934) ఈవిడ మొదటి చిత్రం. ఈవిడ మొత్తం 9 చిత్రాలలో నటించింది. 1939లో క్యాన్సర్ వ్యాధి కారణంగా మరణించింది.
శ్రీరంజని బెజవాడ హనుమాన్‌ దాసు దగ్గర సంగీతం నేర్చుకుంది. మహాకవి కాళిదాసు (1960), ప్రమీలార్జునీయం (1965) వంటి చిత్రాల నిర్మాత కె.నాగమణి కూడా హనుమాన్‌దాసు దగ్గరే హార్మోనియం నేర్చుకుంది. శ్రీరంజని నాటకాలలో నటిస్తున్నప్పుడు నాగుమణి హార్మోనియం వాయించేది. పరిచమయిన కొన్నాళ్ళకి వారిద్దరు భార్యాభర్తలయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. శ్రీరంజని తను చనిపోయేముందు పిల్లల సంరక్షణార్థం తన భర్తను తన చెల్లెలు మహాలక్ష్మిని పెళ్ళి చేసుకోమని చెప్పారు. తర్వాత ఆమె పేరును కూడా శ్రీరంజనిగా మార్చారు. ఆవిడ శ్రీరంజని జూనియర్ గా ప్రసిద్ధి పొందింది, అందువలనే శ్రీరంజనికి సీనియర్ శ్రీరంజని అని పేరు వచ్చింది.
శ్రీరంజని మేనత్తలు నాట్యము చేసేవారు, పాడేవారు. శ్రీరంజనికి ఉత్సాహం కలిగి వారిదగ్గరే ప్రాథమిక పాఠాలు నేర్చుకుంది. రాధాకృష్ణ, శశిరేఖాపరిణయం, సావిత్రి, కనకతార, ఉషాపరిణయం మొదలైన నాటకాలు శ్రీరంజనికి పేరు తెచ్చాయి. అవసరాన్ని బట్టి ఆవిడ నాటకాలలో మగవేషాన్నీ వేసేది. శశిరేఖాపరిణయంలో శశిరేఖ వేసేది, అభిమన్యుడు వేసేది, రాధాకృష్ణలో రాధ, కృష్ణ రెండూ పాత్రలు వేసేది. ఆమెది మంచి గాత్రమని హెచ్.ఎమ్.వి. గ్రామఫోను సంస్థ ఆమెతో ఒప్పందం కుదుర్చుకుని ఎన్నో గ్రామఫోను రికార్డులలో పాడించింది.
 శ్రీరంజనికి ప్రయత్నం లేకుండానే సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది.
హెచ్.ఎమ్.వి వారు రిహార్సల్సుకని శ్రీరంజనిని బెజవాడ తీసుకువెళ్ళారు. ఆ సమయంలో సి.పుల్లయ్య లవకుశ చిత్రం ఆరంభించడానికి నటులకోసం వెతుకుతున్నారు. ఆ చిత్రంలో శ్రీరామునికి పాత్రకి పారుపల్లి సుబ్బారావునీ, వాల్మీకి పాత్రకి పారుపల్లి సత్యనారాయణనీ నిర్ణయించగా వారి ద్వారా శ్రీరంజని గురించి తెలుసుకున్నారు. అలా శ్రీరంజనికి సీతపాత్ర ఖరారు అయ్యింది. శ్రీరంజని, నాగుమణి ముందు గ్రామఫోను రికార్డింగు నిమిత్తం బెంగళూరు వెళ్ళి అక్కడి నుండి లవకుశ షూటింగ్ కోసం కలకత్తా వెళ్ళారు. లవకుశతో శ్రీరంజనికి శోకపాత్రలే ఎక్కువ వచ్చాయి. మాయాబజార్ (1936)లో సుభద్ర, సతీ తులసి (1937)లో పార్వతి, సారంగధర (1937)లో రత్నాంగి, చిత్రనళీయం (1938)లో దమయంతి, శ్రీకృష్ణలీలలు (1935)లో దేవకి, నరనారాయణ (1937)లో గయునిభార్య, మార్కండేయ (1938)లోమరుద్వతి, వరవిక్రయం (1939)లో భ్రమరాంబ ఆమెకు లభించిన ముఖ్య పాత్రలు. ఈ తొమ్మిది చిత్రాలే శ్రీరంజని నటించిన చిత్రాలు. వీటిలో వరవిక్రయం ఒక్కటే సాంఘికం మిగాతావన్నీ పౌరాణిక చిత్రాలే. ఈ తొమ్మిది చిత్రాల తోనే ఆవిడ మేటితారగా ఎదిగింది. ఆవిడ సినిమాలలోకి వచ్చిన తర్వాత కూడా నాటకాలలో నటించడం మానలేదు. పాట, పద్యం మాత్రమేకాకుండా హావభావాలు ప్రకటించడంలోనూ శ్రీరంజనికి మంచి పేరుండేది. ఆమెది చక్కటి ఉచ్ఛారణ అని, చక్కని భాష అనీ ప్రేక్షకులు చెప్పుకునేవారు.
నాటకాలలో నటించినవారికంటే చలనచిత్రాలలో నటించిన వారికే ఆకర్షణ ఎక్కువ. రంగస్థలం నుండి చలనచిత్రరంగంలోకి ప్రవేశించిన సి.ఎస్.ఆర్, గగ్గయ్య, కన్నాంబ వంటి వారితోటే ప్రేక్షకాదరణ మొదలైంది. ఐతే ఆరాధన, అభిమానం మాత్రం శ్రీరంజనితోనే మొదలయ్యాయి. తెలుగులోమొదటిబాక్స్‌ఆఫీసుచిత్రంగాచెప్పుకోవలసిన లవకుశ  (1934) లో శ్రీరంజని సీత పాత్ర ధరించింది. సినిమాతో పాటు శ్రీరంజనికీ ప్రేక్షకాదరణ లభించింది. ఆ చిత్రంలో సీతాదేవి కష్టాలను చూసి ప్రేక్షకులు కన్నీళ్ళ పర్యంతమయ్యేవారు, సాక్షాత్తు సీతమ్మే తెరమీదకి దిగివచ్చినట్టు నమ్మేవారు. శ్రీరంజనికి ఇదే తొలి చిత్రం అంతకుముందు రంగస్థలనటి. ఈవిధంగా తొలి చిత్రంతోనే గ్లామరు, ఆరాధన సంపాదించుకున్న మొదటి నటి శ్రీరంజని.
లవకుశ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న రోజుల్లో ఆమేకు అనేక చోట్ల సన్మానాలు జరిగాయి. ప్రజలు శ్రీరంజనికి పసుపుకుంకుమలు ఇచ్చి నమస్కారాలు పెట్టేవారు, కొందరు పాదనమస్కారాలు చేసి చీరిచ్చేవారు. సొంతవూరులో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆమెను అభిమానులు వెళ్ళి గుడి దేవతను ఆరాధించినట్టు, పళ్ళు, పువ్వులు, పాలు ఇచ్చి దండాలు పెట్టేవారు. మద్రాసులోని క్రౌన్‌టాకీసులో లవకుశ శతదినోత్సవం జరిగింది, ఆ ఉత్సవంలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, మద్రాసు గవర్నరు, జైపూరు మహారాజావారు పాల్గొని చిత్రాన్ని, దర్శకుడు సి.పుల్లయ్యని, నటవర్గాన్ని ప్రసంసించారు. ఆ సందర్భంలో శ్రీరంజనికి స్వర్ణపతకం బహుకరించారు.
1939 సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడిన శ్రీరంజని అదే సంవత్సరం తన స్వగ్రామంలో పరమపదించారు. అప్పుడు ఆమె వయసు కెవలం 33. ఆమె మరణవార్తకి పత్రికలు ప్రాముఖ్యం ఇచ్చి చిన్న వయస్సులోనే పెద్ద తార రాలిపోయిందంటూ రాశాయి. సీతాదేవిగా శ్రీరంజనిని చూసి కన్నీళ్ళు పెట్టుకున్న ప్రేక్షకులు ఆమె మరణవార్త విని మరింత శోకించారు.
నటిగా.
• లవకుశ (1934) లో సీత
• శ్రీకృష్ణలీలలు (1935) లో దేవకి
• సతీ తులసి (1936) లో పార్వతి
• మాయాబజార్ (శశిరేఖా పరిణయం) (1936) లో సుభద్ర
• సారంగధర (1937) లో రత్నాంగి
• నరనారాయణ (1937) లో గయుని భార్య
• చిత్రనళీయం (1938) లో దమయంతి
• మార్కండేయ (1938) లో మరుద్వతి
• వరవిక్రయము (1939) లో భ్రమరాంబ
గాయనిగా.
•సారంగధర (1937)

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం