శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 వేదాలప్రకారం మునులధ్యానం‌ఆధ్యాత్మికత కన్నా వైద్యం వైపు ఎక్కువ ఉండేది.ఆరోగ్యమే మహాభాగ్యం కదా?వారి సంఖ్య కూడా చాలా తక్కువ.శ్రౌతధర్మాచరణ కర్మకాండలు చేసేవారి ఉద్దేశం ధన సంతానం ప్రాప్తి.కానీ మునులకు మాత్రం పరబ్రహ్మ ప్రాప్తి ముఖ్య ఉద్దేశం.ముని మననశీలిగా మౌనవ్రతం పూనేవాడు.వాక్యసంయమంని పాలించారు.ముని మనన్ మన్ ధాతువు నుండి వచ్చాయి.వ్యాస పాణిని కాత్యాయన పతంజలి అంతామునులు.జనకల్యాణవాదులు.
ముముర్ష సంస్కృతశబ్దంకి అర్థం చావాలనే కోరిక.మరణాసన్నం చావుకి దగ్గర.మోక్షాన్ని కోరటంని ముముక్షా అంటారు.ఓవిధంగా మృత్యువు కూడా ముక్తి మోక్షం.మృత్యువు మోక్షం పర్యాయాలు గా మన భారతీయ సమాజంలో నిలిచిపోయాయి 🌹
కామెంట్‌లు