దివికి నిచ్చెనవేశా
శూన్యంలో కాపుకాశా
గగనం నుండి గమ్యం చేరుతా
ఎందుకంటే....
శూన్యం నుండే కదూ
దేవుడు సమస్తం సృష్టించేది
శూన్యం నుండే కదూ
బాబాలు సృష్టించేది
శూన్యం నుండే కదూ
నాయకులు ఓట్లు, కోట్లు వెనకేసేది
కనబడనిది నిజం కాదని
విర్రవీగుతుంటారు కానీ....
గాలీ, కరెంటూ కనబడుతున్నాయా?
పద! వెనుక ఆపద!
అందుకే ముందుకే పద!
అది శూన్యంలోకైనా సరే
కాలం గొడ్డుది కాదు
చెక్క గుర్రాలు మీరు
చలనం లేదు
నన్ను కవ్విస్తారు మీరు
అయినా, నేను తొందర పడతానా?
పక్షిలా ఎగురుతా
చేపలా ఈదుతా
గగనానికి గాలంవేస్తా
శూన్యానికి కాపుకాస్తా
దివికి నిచ్చెనవేస్తా!!
*********************************
నిచ్చెనవేస్తా;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి