⚜️ఓ సంఘ సేవకులార!
ఓ దేశ ప్రేమికులార!
వినరండి! ప్రియమార!
ఓ ఆత్మ బంధువు లార! (1)
⚜️సంపాదించిన స్వాతంత్ర్యం
సంరక్షణ కావించడం
మన తక్షణ కర్తవ్యం
ఓ ఆత్మ బంధువులార! (2)
( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
👌 1947వ సంవత్సరం, ఆగష్టు15వ. తేదీని.. మన భారత దేశమునకు.. స్వాతంత్ర్యము లభించింది! అనగా స్వేచ్చాయుత జీవనం వచ్చింది! విదేశీయుల పరిపాలన ముగిసింది!
ప్రణాళికా బద్దంగా దేశం అభివృద్ధి చెందుతున్నది! అందువలన, మనమంతా దేశవ్యాప్తంగా; నేడు "అమృతోత్సవములు" వైభవముగా జరుపుకొను చున్నాము!
ఈ శుభ సందర్భములో.. "మనమంతా ఒక్కటే!" అనే జాతీయభావముతో నుండాలి! ఐకమత్యముగా జీవించాలి! మనపూర్వులు సంపాదించిన స్వాతంత్ర్యమును పరిరక్షించు కోవాలి! మనలోనున్న కులం.. వర్గం.. ప్రాంతం.. మున్నగు విభేదములను విడచి పెట్టాలి! అందరూ.. ఒకే కుటుబ సభ్యులుగా, కలసి మెలసి, ప్రేమానురాగములతో మనుగడ సాగించాలి!
👌మన భరతఖండం.. వేదము, విజ్ఞానము, జాతి రత్నములకు నిలయ మైనది! భోగ భాగ్యములు, సర్వ సౌభాగ్యములతో.. విరాజిల్లు చున్నది! శైవము.. వైష్ణవము.. శాక్తేయము.. గాణాపత్యము.. సౌరము.. బౌద్దము.. జైనము.. సిక్కిము.. మున్నగు మత సంప్రదాయములకు ఆలవాలమైన జన్మభూమి!
భిన్నత్వం లో ఏకత్వం.. మన భారతీయ ధర్మము! అతి సనాతనమైనది, నిత్య నూతనమైనది.. మన హైందవ జీవన విధానము!
భారత మాతకు జేజేలు!
బంగరు భూమికి జేజేలు!
🚩సీస పద్యము
వేదముఖుల తోడ, వేదఘోషల తోడ
విలసిల్లి నట్టిదీ వేదభూమి!
రత్నాల రాశులన్ రమణీయ శోభతో
ప్రసవించి నట్టిదీ రత్నభూమి!
మిసమిస లాడిన, పసిడి పంటల తోడ
భాసురంబైనదీ భరత భూమి!
విజయలక్ష్మిని గొన్న వీరులందరి తోడ
వెలుగొంది నట్టిదీ వీరభూమి!
అన్ని మతాలకు ఆరాధనీయమై
గణ్యత గొన్నదీ పుణ్యభూమి!
🚩తే.గీ
నిఖిల విఖ్యాత కవులకు నిలయభూమి!
సకల విజ్ఞానధనులకు జన్మభూమి
అట్టి సద్భూమిలో హృదయమ్ముపొంగ,
మమ్ము పుట్టించితివి, తదృణమ్ము దీర్ప
వందనమ్మును జేతుమో భరతమాత!
( "కళా రత్న" డా. మీగడ రామలింగ స్వామి., )
🔆జయ భారతమాతా కీ జై!
జయ జగన్మాతా కీ జై!
జై హింద్! జై భారత్!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి