ముదమున అక్షరమును నేర్పి
ఆదిత్యుని కిరణములు తొడిగి
అజ్ఞాన తిమిరములకు
ఉద్యాపన చేయునట్టి గురువుకు దండం !!
స్వార్థమింతయు కాన రాక,
సర్వసంపదలతో, తూచలేని
చదువులు నేర్పుచూ
సర్వశ్రేష్ఠునిగ నిలుప తలచు గురువుకు వందనం !!
సంఘజీవనమందు వలయు
సంస్కారమలది, చక్కనైన భాషతో
నడక,నడవడిక,విడువక ఓర్పుతో,
నుడువుచుండు గురువునకు నమస్సులు !!
ఆలుబిడ్డలు కొరకు ఆరాటమేలేదు
ఆస్తిపాస్తులు లేవని ఆందోళనే లేదు
ఎదిగి, ఒదిగే ఛాత్రులున్నను చాలని
జీవన పర్యంతము తనియు గురువుకు వందనం!!
నలుదెసల ఖ్యాతితో నిగ్గు దేలుచు,
శిష్యులు నడుచుకొనగ ,
నభము నక్షత్రాలను వెలిగించి స్వాగతించిన,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి