దుష్కర్మ - డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ఎవరైనా బంధువులు మన ఇంటికి వస్తే  మనం చేసే  ఉప చర్యలు  వారికి ఎంతో ఆనందాన్ని కలుగచేస్తాయి  భార్యాభర్తలు ఉన్న ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు  భార్యాభర్తలు మాత్రమే వారికి  అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు  పిల్లలు లేని ఇల్లు ఎలా ఉంటుంది  అని మనం పెద్దలను అడిగితే  రాత్రులు దీపం లేకపోతే నీ ఇల్లు ఎలా ఉంటుందో పిల్లలు లేని ఇల్లు అలా ఉంటుంది ఏ ఇల్లు అయినా హాయిగా కళకళ లాడుతూ ముచ్చటగా ఉండాలి అంటే పిల్లలు ఉండి తీరాలి  వారి ఆటపాటలతో  వారి చిలిపి చేష్టలతో  ఏ తల్లి ముచ్చటపడదు  ఏ తండ్రి వాళ్లను గుర్తు చేయకుండా ఉంటాడు  పిల్లలు ఇచ్చే ఆనందం  ఈ ప్రపంచంలో మరెవ్వరు  ఏ పద్ధతిలోనూ మనకు ఇవ్వలేరు అన్న విషయం జగత్విదితం.
మనం దొడ్లోకి వెళితే  అక్కడ ఎదురుగా మనకు కనిపించే  ఎద్దులు దూడలు బర్రెలు  గోవులు  చూడడానికి ఎంత కళకళలాడుతూ ఉంటాయి  కన్నుల పండుగగా ఉంటుంది  గృహస్తులు ఎవరైనా వాటి మీద ప్రేమతో వాటికి పేర్లు కూడా పెట్టుకుని వాటి వీపు నెమరుతో ఉన్నప్పుడు  అవి ఎంత ఆనందిస్తాయో  దానిని చూసి ఇతను ఎంత మురిసిపోతాడో  అది అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది  ఒక ఆవు  కోడెదూడను పెట్టింది అంటే  చిన్నతనం నుంచి దాని ఆటలు  దాని చిందులు  ఎటు నుంచి ఎటు దూకుతుందో తెలియని స్థితి  మనల్ని ముప్పుతిప్పలు పెట్టిన  ఆ క్రీడ ఎంత ఆనందాన్నిస్తుంది  ఆ రోజంతా ఎంతో ప్రశాంతంగా హాయిగా  గడుపుతాడు దాని యజమాని అది పెరిగి పెద్దదైన తర్వాత  మంచి వయసులో ఉన్నప్పుడు  ఆ రైతు దాని ద్వారా  వ్యవసాయానికి ఉపయోగించే పనులన్నీ చేయించుకుంటాడు  ఆ దొడ్లో గిత్తలు ఎక్కువగా ఉండి ఒక దానిని అమ్మదలచుకుంటే  ఇంతకు పూర్వం  వేళ్ళల్లో ఉండే దాని ధర ఈరోజు లక్షల్లో ఉంది  దాని తల్లి గోవును ప్రతి కృషీవలుడు గోమాతగా పూజిస్తాడు. అలాంటి గోవు  లను  తీసుకుని వెళ్లి  దాని ప్రాణం తీయడానికి ఏర్పాటు చేసే దాని యజమాని  ఎంత కర్కశ  హృదయుడై ఉంటాడు  నీ జీవితానికి ఎంతో ఉపయోగపడి  నిన్ను వృద్ధి లోని తీసుకొచ్చిన దానిని కర్కసుల చేతులకు అప్పచెప్పుతున్నావు  పరోపకారి అయిన ఆ గోమాతను  అలా శిక్షించే నీకు  ఎలాంటి మరణం వస్తుందో ఆలోచించావా  ఒకవేళ ఆలోచిస్తే అలాంటి దుష్కర్మ జీవితంలో చేయగలవా  ఆలోచించి చెప్పు.


కామెంట్‌లు