హరివిల్లు రచనలు,; -కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 216
🦚🦚🦚🦚
ప్రతి మనిషి గుండెల్లో
సముద్రమంత బాధ.....!
ఆత్మ స్థైర్యం కలిగి
పెంచు యిసుమంత మేధ...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 217
🦚🦚🦚🦚 
అధ్యయనం చేయుచు
అక్షరాల బలం పెంచు.....!
ఉపయుక్త పదాలల్లుచు
అద్భుత కవిత సృష్టించు....!!
 
🦚🦚🦚🦚
హరివిల్లు 218
🦚🦚🦚🦚
ఉన్నంతలో బ్రతుకుచు
ఉన్నతిని ఆలోచించు....!
గొప్ప లక్ష్యం స్థిరపరచి
సైనికుడిలా శ్రమించు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 219
🦚🦚🦚🦚 
విరివిగ మల్లెలు పూసిన
వ్యాపించును సువాసనలు..!
మనసుకు వలపులు తాకిన
వికసించును కోరికలు...........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 220
🦚🦚🦚🦚 
ఏనాడు ఆధిపత్యం
కోరని కష్ట జీవులు......!
హితకారక సామాజిక
సేవల శ్రమజీవులు......!!
                (ఇంకా ఉన్నాయి)


కామెంట్‌లు