హరివిల్లు రచనలు,కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,9440522864.
 హరివిల్లు 246
🦚🦚🦚🦚
కార్యాలోచనలకు
మానసిక మేధవసరం..!
కార్యాచరణలకు
ధీయుత బలాలవసరం...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 247
🦚🦚🦚🦚 
భూపరిభ్రమణంలా
జీవితం! ఒక బొంగరం..!
అతీత దైవ శక్తులకు
లోబడి! క్షణ భంగురం...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 248
🦚🦚🦚🦚
వచ్చిన కష్టములన్నియు
మనకు భరింపరానివే.......!
తాత్కాలికములే కాని
తుదకు దాటగలిగేవే........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 249
🦚🦚🦚🦚 
మండుటెండలు పిలిచెను
వాన చినుకులు కురిసెను....!
ఏడు రంగులు విరిసెను
అందరి మనసులు మురిసెను..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 250
🦚🦚🦚🦚 
చివరి దశకు చేరుకొని
శోధించుట ఉండదు........!
చివరి వరకు దాచుకొని
సాధించుట తగదు.......!!
                (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు