హరివిల్లు రచనలు,;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 256
🦚🦚🦚🦚
కవుల రచనా శక్తి 
దేశానికి సమున్నతం...!
జనుల పఠనాసక్తి
ఎదుగుదలకు సంకేతం...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 257
🦚🦚🦚🦚 
మాతాపితరుల
నిత్య సత్య నడవడికలు..!
వారి సంతానానికి
భావి జీవిత పునాదులు..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 258
🦚🦚🦚🦚
సేద్యం చేసే వారికి
తెలియును సేద్యం విలువ..!
బాధ పడే వారికి
బోధపడు కష్టం విలువ.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 259
🦚🦚🦚🦚 
వచ్చి పోతుంటాయి
కొత్త వత్సరాలు........!
సాధించి చూపాలి
సరిక్రొత్త సంస్కరణలు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 260
🦚🦚🦚🦚 
సకాల వర్షములకై
సన్నాహక నిరీక్షణ......!
పంటలు పండించాక
భీతావహ నిరీక్షణ........!!
                (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు