హరివిల్లు రచనలు,;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 191
🦚🦚🦚🦚
నిన్ను గుర్తించిన, మంచి
స్నేహితులను కోల్పోకు....!
పైపూతలకు చేరువై
నవరత్నాలను వదలకు..‌!!
🦚🦚🦚🦚
హరివిల్లు 192
🦚🦚🦚🦚 
నీటి అలల మెరుపులా
మారకూడదు కవితలు...!
కాచిన పాల మీగడల
కమ్మదనపు కవితలు......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 193
🦚🦚🦚🦚
మదిలో మెదిలే సత్వర 
భావనల ఆచరణలు.....!
నిరుపమాన సేవలతో 
భావితరపు వారధులు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 194
🦚🦚🦚🦚 
ఉన్నంతలో సర్దుకొని
సంతోషంగ జీవించు....!
అందరిని చిరునవ్వుతో
పిలిచి ఆప్యాయత పంచు..!!
 
🦚🦚🦚🦚
హరివిల్లు 195
🦚🦚🦚🦚 
అవతలి వ్యక్తిలో చిరు
చోటివ్వమని కోరుకో....!
మంచివారికి

నీవే
చోటిచ్చి మది పెంచుకో...!!
                       (ఇంకా ఉన్నాయి)
కామెంట్‌లు