జీవన సార్ధకత.- డా. పివిఎల్ సుబ్బారావు,94410 58797..
 37.
    పుట్టినప్పుడు, 
             వెన్నలా ఉన్నావు!
    
    పున్నమి వెన్నెల,
                  అనిపించావు!
     మంచి గంధమై ,
           హాయిని ఇచ్చావు!
 
    మలయ మారుతమై,
           మంచిగా వీచావు !
   నేడు నానాటికి,
   తీసికట్టు అవుతున్నావు.!
38.
స్వయంకృషితో,
                 ఋషివి కావాలి !
మనిషంటే,
        మహర్షి అనిపించాలి !
సత్యానికి,
 దాసుడువై జీవించాలి! 
ధర్మానికి,
 రాముడివై రాణించాలి !
మానవా! నీవు ,
నవపల్లవమై చిగురించాలి.!
39.
నేల విడిచి ,
          సాము చేస్తున్నావు! 
తెడ్డు పారేసి,
 పడవ నడుపుతున్నావు! 
హద్దులు మరిచి,
          బతుకుతున్నావు! 
పద్దులకందని,
  ఖర్చులు అంటున్నావు! 
బతుకు ఎలా ముగుస్తుంది, అంటావు?
_______________________
రేపు కొనసాగుతుంది.


కామెంట్‌లు